కేరళ : టీమ్ ఇండియా స్టార్ , ICC పురుషుల T20 ప్రపంచ కప్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజు శాంసన్ గురించి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. నేను అతనికి ఒక రకంగా మామయ్యలా ఉన్నాను. శాంసన్ కు ఎంతో ప్రోత్సాహం అందించడం జరిగిందన్నాడు. అతనికి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అతను తర్వాతి MS ధోనీ అవుతాడని నేను అతనికి చెప్పాను. అతను అచంచలమైన ఏకాగ్రతతో, ప్రశాంతంగా, సంయమనంతో ఉంటూ తన ఆటలో అత్యున్నత స్థాయిలో కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు ఎంపీ.
అయితే టి20 ఫార్మాట్ లో తనను తాను ప్రూవ్ చేసుకున్న సంజు శాంసన్ ఇప్పటికే వన్డే ఫార్మాట్ లో కూడా సత్తా చాటాడని , ఇక బీసీసీఐ సెలక్షన్ కమిటీ తనను వన్డే జట్టులోకి తీసుకోవాలని కోరాడు. ఎందుకంటే తను అన్ని ఫార్మాట్ లకు తగినట్టుగా తనను తాను మలుచుకునే ప్రయత్నం చేస్తాడని పేర్కొన్నాడు. ప్రధానంగా సంజు శాంసన్ ఆడే తీరు అద్భుతంగా ఉంటుందని , తన టైమింగ్ డిఫరెంట్ గా ఉండడం ఇతర బౌలర్లకు ఇబ్బందికరంగా మారుతుందనడంలో సందేహం లేదన్నాడు ఎంపీ శశి థరూర్. ఇప్పటికే టి20 ఫార్మాట్ లో పరుగుల వరద పారిస్తున్న శాంసన్ వన్డే జట్టులోకి వస్తే భారత జట్టు మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నాడు.
