న్యూజిలాండ్ : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ పై. తాజాగా భారత జట్టు టి20 సీరీస్ లో భాగంగా న్యూజిలాండ్ దేశంలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్ లో భారత జట్టు అరుదైన రికార్డ్ నమోదు చేసింది. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే అత్యధిక ఛేజింగ్ గేమ్ ఇది. ఎక్కడా తొట్రుకు లోనుకాకుండా కూల్ గా దుమ్ము రేపింది భారత జట్టు. ప్రధానంగా సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 33 బంతుల్లో 67 రన్స్ చేశాడు. ఇక అభిషేక్ శర్మ తాను కూడా బాదడం మొదలు పెట్టాడు. భారీ టార్గెట్ ను సులువుగా ఛేదించింది. ఇండియా అద్బుత విజయాన్ని నమోదు చేసింది. 1-0 తేడాతో ముందంజలో ఉంది . ఈ మ్యాచ్ లో టాప్ స్కోర్ చేయడమే కాకుండా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు గంభీర్.
సంజు శాంసన్ విషయంలో నాకు నచ్చే విషయం ఏమిటంటే, జట్టులో తన స్థానానికి ముప్పు ఉన్నప్పుడు కూడా అతను ‘ఏదో ఒకలా 10–12 బంతులు ఆడి, 12–15 పరుగులు చేసి వెళ్ళిపోదాం అని అనుకునే క్రికెటర్ కాదన్నాడు హెడ్ కోచ్. జట్టులో తన స్థానం ప్రమాదంలో ఉన్నా లేదా గత మ్యాచ్లలో భారీ పరుగులు సాధించినా, అతను తన సహజ శైలిలోనే ఆడటం కొనసాగిస్తాడని ప్రశంసలు కురిపించాడు. అతను రిస్క్ తీసుకుని ఆడే ఆటగాడు కాబట్టి, కొన్నిసార్లు త్వరగా అవుట్ అయ్యే అవకాశం ఉంటుందని, ఇది ఆటలో సహజమేనని పేర్కొన్నాడు గంభీర్. సంజు శాంసన్ వంటి ఆటగాళ్లకు ‘నేను నీకు అండగా ఉన్నాను, ఇలాగే ఆడుతూ ఉండు. ఎందుకంటే నువ్వు రాణించినప్పుడు, ఖచ్చితంగా మాకు విజయాన్ని అందిస్తావు’ అని చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నాడు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ సరిగ్గా అదే చేస్తున్నాడంటూ ప్రశంసలు కురిపించాడు ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే.



















