చెన్నై : చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2026కి సంబంధించి భారీ ధరకు ఎవరూ ఊహించని రీతిలో కేరళ స్టార్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్ ను తీసుకుంది. తన ఒక్కడి కోసం రవీంద్ర జడేజా, సామ్ కరన్ ను వదులుకుంది. సామాన్యంగా తక్కువ ధరకే ఆటగాళ్లను వేలంపాటలో తీసుకుంటుంది. ప్రత్యేకించి మహేంద్ర సింగ్ ధోనీని కాదని సీఎస్కే యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు ఒప్పుకోదు. కానీ ఎవరూ ఊహించని రీతిలో ధోనీ సంజూ శాంసన్ వైపు మొగ్గు చూపాడు. దీనికి కారణం కూడా ఉంది. తన లాగానే తను బ్యాటర్, వికెట్ కీపర్, మ్యాచ్ విన్నర్ గా కూడా చాలా సార్లు నిరూపించుకున్నాడు సంజూ శాంసన్.
ఇక ధోనీ ఎక్కువ కాలం ఆడడు. ఈ ఏడాది మాత్రమే తను మైదానంలో అడుగు పెట్టే ఛాన్స్ ఉందని టాక్. ఇక తమిళనాడు వాసులకు మహేంద్ర సింగ్ ధోనీ అంటే చచ్చేంత ప్రాణం. ఎందుకంటే ఆ జట్టును పలుమార్లు ఫైనల్ కు తీసుకు వెళ్లాడు. కప్ కూడా తన సారథ్యంలోనే వచ్చింది. మరో వైపు సంజూ శాంసన్ కూడా తన సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టును ఐపీఎల్ ఫైనల్ దాకా తీసుకు వెళ్లాడు. మొత్తంగా చూస్తే ధోనీకి అసలైన వారసుడు సంజూ శాంసన్ అని గుర్తించింది చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మమెంట్. అందుకే తన ఒక్కడి కోస ఇద్దరి కీలక ఆటగాళ్లను వదులు కోవడమే కాకుండా ఏకంగా రూ. 18 కోట్లు ఖర్చు చేసింది తన పర్స్ నుంచి. ఇక తమిళ తంబీలు ధోనీతో పాటు శాంసన్ ను ఆరాధించడం ప్రారంభించారు. మొత్తంగా శాంసన్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారాడు. అంతే కాదు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు.
