కేరళ : భారతీయ జనతా పార్టీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ కీలక ప్రకటన చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్. ఎవరూ ఊహించని రీతిలో శుభ్ మన్ గిల్ ను పక్కన పెట్టేశారు. తనతో పాటు జితేష్ శర్మ, హర్షిత్ రాణాను కూడా తప్పించారు. ఈ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో కేరళ రాష్ట్రానికి చెందిన టాప్ క్రికెటర్ సంజూ శాంసన్ ను ఎంపిక చేశారు. తనతో పాటు ఇషాన్ కిషన్, రింకూ ఇంగ్ లను ఎంపిక చేయడాన్ని స్వాగతించారు.
తిరువనంతపురానికి చెందిన యంగ్, డైనమిక్ క్రికెటర్ సంజూ శాంసన్ ఎంపిక కావడం పట్ల రాజీవ్ చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. తన మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బీజేపీ చీఫ్. తను అన్ని ఫార్మాట్ లకు సరిపోయే క్రికెటర్ అని పేర్కొన్నాడు. తమ రాష్ట్రం పేరును ప్రపంచ వ్యాప్తంగా తలుచుకునేలా చేయడం పట్ల మరింత ఆనందంగా ఉందన్నాడు రాజీవ్ చంద్రశేఖర్. సంజూ శాంసన్ కు ఉన్న ఫాలోయింగ్ మామూలు కాదన్నాడు. తానే ఆశ్చర్యానికి లోనయ్యానని పేర్కొన్నాడు. ఇదే సమయంలో జట్టుకు దూరంగా ఉన్నా, ఎంపిక కాక పోయినా ఏనాడూ నిరాశకు లోను కాలేదన్నాడు. చివరి దాకా శాంసన్ పడిన కఠోర శ్రమ , పట్టుదల యువతకు స్పూర్తి దాయకంగా నిలుస్తందన్నాడు. వరల్డ్ కప్ కు ఎంపికైనందుకు ప్రత్యేకంగా శాంసన్ కు శుభాకాంక్షలు తెలిపాడు.
