న్యూఢిల్లీ : తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన స్వతహాగా క్రికెట్ ప్రేమికుడు. తనకు కేరళ కు చెందిన స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ అంటే వల్లమాలిన అభిమానం. తాజాగా జరిగిని ఐసీసీ టి20 వరల్డ్ కప్ టోర్నీలో సత్తా చాటాడు. తను కీలక భూమిక పోషించాడు. తాను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎన్నికయ్యాడు. తను విండీస్ తో 97 రన్స్ చేస్తే , సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ తో 89 పరుగులు చేస్తే , ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తను కీలకమైన 89 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఈ సందర్భంగా భారత జట్టు టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించింది. మూడుసార్లు కప్ ను గెలిచి అరుదైన రికార్డును నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది కీవీస్ ముందు. దీంతో 159 పరుగులకే చాప చుట్టేసింది. ఈ సందర్బంగా భారత జట్టు గెలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఇదే సమయంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం నియోజకవర్గానికి చెందిన క్రికెటర్ సంజు శాంసన్ సత్తా చాటడం ఆనందంగా ఉందన్నాడు.
