కేరళ : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా, శ్రీలంక సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరిలో నిర్వహించే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును ప్రకటించింది. కీలకమైన మార్పులు చేసింది. అంతే కాదు కొందరికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది. ఎవరూ ఊ హించని రీతిలో జట్టుకు భారంగా మారిన టి20 జట్టు వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో పాటు జితేష్ శర్మను నిర్దాక్షిణ్యంగా తప్పించింది. . అంతే కాదు హెడ్ కోచ్ గౌతం గంభీర్ లేకుండానే సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ , కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తో పాటు మరో సెలెక్టర్ మీడియాతో మాట్లాడారు. గత కొంత కాలంగా ఫెవరటిజం పని చేస్తోందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిభ కలిగిన ఆటగాళ్లను కాకుండా కేవలం తమకు నచ్చిన వారికే ప్రయారిటీ ఇస్తున్నారంటూ మండిపడ్డారు ఫ్యాన్స్.
గత్యంతరం లేక సెలెక్షన్ కమిటీ సదరు ఆటగాళ్లపై వేటు వేసింది. ఫామ్ లో ఉన్నా తనను పక్కన పెడుతూ వచ్చారు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. శుభ్ మన్ గిల్ కు గాయం కావడంతో 5వ టి20 మ్యాచ్ కు ఎంపిక చేశారు. సౌతాఫ్రికాతో జరిగన మ్యాచ్ లో శాంసన్ కేవలం 22 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్స్ లతో 37 కీలకమైన పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు భారీ స్కోర్ చేసేందుకు దోహద పడ్డారు శాంసన్, అభిషేక్ శర్మలు. తనను ఏరికోరి టి20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసింది బీసీసీఐ. దీనిపై స్పందించాడు సంజూ శాంసన్. తన ఇస్ స్టా లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రంగులు ఎల్లప్పటికీ నిలిచే ఉంటాయి..అవి ఎన్నటికీ మసక బారవు అని పేర్కొన్నాడు. నమ్మకం, విశ్వాసం, ఓర్పు, సహనంగా ఉండడమే తనకు ఇష్టమని తెలిపారు. తను చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
