వ‌న్డే ఫార్మాట్ పై క‌న్నేసిన సంజూ శాంస‌న్

విజ‌య్ హ‌జారే ట్రోఫీలో కేర‌ళ త‌ర‌పున బ‌రిలోకి

hellotelugu-SanjuSamson

కేర‌ళ : వ‌న్డే ఫార్మాట్ లోకి తిరిగి ప్ర‌వేశించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. త‌ను తాజాగా స్వ‌దేశంలో జ‌రిగే న్యూజిలాండ్ టి20 సీరీస్ తో పాటు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 2026లో జ‌రిగే భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హించే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడే భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. ఓపెన‌ర్ గా, వికెట్ కీప‌ర్ గా త‌ను కీల‌క‌మైన పాత్ర పోషించ‌నున్న‌ట్లు బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ ప్ర‌క‌టించాడు. దీంతో టి20 ఫార్మాట్ తో పాటు వ‌న్డే ఫార్మాట్ లో గ‌తంలో త‌ను ఆడాడు. కానీ హెడ్ కోచ్ గంభీర్ ప‌క్క‌న పెట్టాడు. దీంతో మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించు కునేందుకు గాను దేశీవాళిలో జ‌రిగే విజ‌య్ హ‌జారే ట్రోఫీలో పాల్గొనాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు కేర‌ళ జ‌ట్టు త‌ర‌పున త‌ను ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నాడు.

ఇందులో భాగంగా తాజాగా కేర‌ళ క్రికెట్ అసోసియేష‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. యువ ఆటగాడు రోహన్ కున్నుమ్మల్‌ను కెప్టెన్‌గా నియమించింది. టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించుకున్న సంజు శాంసన్‌కు 50 ఓవర్ల టోర్నమెంట్‌లో కూడా చోటు దక్కింది. త‌న‌తో పాటు ఎండి నిధీష్, విష్ణు వినోద్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇక ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి అందరినీ ఆకట్టుకున్న యువ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ కూడా ఆడ‌తాడు. ఇక‌ కేరళ జట్టు త్రిపుర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పుదుచ్చేరి, తమిళనాడుతో పాటు గ్రూప్ Eలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు శాంస‌న్ వ‌న్డే ఫార్మాట్ లో ఒక సెంచ‌రీతో పాటు మూడు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

Exit mobile version