Sanju Samson : దుబాయి : దుబాయి వేదికగా ఆసియా కప్ 2025 మెగా టోర్నీ ప్రారంభానికి సిద్దమైంది. రేపటి నుంచి టోర్నీ స్టార్ట్ అవుతుంది. పలు జట్లు ఇప్పటికే చేరుకున్నాయి దుబాయికి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ). దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు బీసీసీఐ కార్యదర్శి జే షా. ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు కూడా చైర్మన్ గా ఉన్నారు. ఈసారి గతంలో కంటే ప్రైజ్ మనీ పెంచారు. ప్రస్తుతం అందరి దృష్టి సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుపైనే ఉంది. కారణం ఇందులో అత్యంత జనాదరణ పొందిన ఆటగాడు ఉన్నాడు. తను ఎవరో కాదు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson). తన ఓపెనింగ్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్.
Sanju Samson Busy on Practice
సంజూ శాంసన్ కంటే అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ప్రారంభిస్తారని చెప్పకనే చెప్పాడు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. జట్టు ప్రకటించిన తర్వాత కేరళ క్రికెట్ లీగ్ లో సంజూ శాంసన్ దుమ్ము రేపాడు. సెంచరీతో పాటు హాఫ్ సెంచరీలు చేశాడు. సూపర్ షోతో ఆకట్టుకున్నాడు. తన సత్తా ఏమిటో చూపించాడు. దీంతో క్రికెట్ వర్గాలు పెద్ద ఎత్తున సంజూ శాంసన్ కు మద్దతు ఇస్తున్నారు. తనను తప్పకుండా తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో జట్టు హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఏం నిర్ణయం తీసుకుంటాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా విశ్వసనీయ సమాచారం మేరకు తన ఫస్ట్ ఛాయిస్ శాంసన్ కాక పోతే ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దుబాయ్ లో ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు.
Also Read : Asia Cup 2025 – Strong Focus : అందరి కళ్లు ఆసియా కప్ పైనే



















