కేరళ : తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అద్బుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు తమ కేరళ రాష్ట్రానికి చెందిన క్రికెటర్ సంజు శాంసన్. తను ఇప్పుడు నేషనల్ హీరోగా మారి పోయాడు. టోర్నమెంట్ లో తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారత జట్టు విశ్వ విజేతగా నిలవడంలో కీలక భూమిక పోషించాడు. కేవలం 5 ఇన్నింగ్స్ లు ఆడి 321 రన్స్ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ఈ సందర్బంగా సంజు శాంసన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు జాతీయ మీడియాతో. తను క్రికెటర్ మాత్రమే కాదు మంచి మనసు ఉన్న వ్యక్తి అంటూ తెలిపాడు.
తను 14 ఏళ్ల నుంచి ఉన్నప్పుడే తెలుసు అని చెప్పాడు శశి థరూర్. ఆనాడే తనలో ఉన్న స్పార్క్ ఏమిటో తెలిసి పోయిందన్నాడు. తన అంచనాలు తప్పలేదని, ఇవాళ దేశవ్యాప్తంగా ఏ క్రికెటర్ కు లేనంతటి అభిమానులను, ప్రేమను పొందాడంటూ ప్రశంసలు కురిపించాడు ఎంపీ. సంజు శాంసన్ ను ధోనీతో పోలుస్తున్నారని కానీ తను తన లాగే ఆడతాడని పేర్కొన్నాడు. సామ్సన్ తర్వాతి ధోనీ కావాల్సిన అవసరం లేదు, అతను సాటిలేని వ్యక్తిగా నిలుస్తాడని అన్నారు ఎంపీ. అతను “సాటిలేని, ఏకైక సంజు సామ్సన్‌గా” నిలుస్తాడు. సామ్సన్ తర్వాతి ధోనీ అవుతాడని తాను గతంలో చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ ప్రస్తావించినప్పుడు, భారత క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒక సందర్భంలో ఆయనతో ఇలా అన్నారు.
