ఆగ‌స్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని కార్య‌క్ర‌మం

అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు

hellotelugu-SanjeeviniProject

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. ఆయ‌న క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్బంగా సంజీవిని ప్రాజెక్టు గురించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం పైల‌ట్ కింద అమ‌లు చేస్తున్నామ‌ని, ఇక నుంచి ఆగ‌స్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్రజల వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు తయారు చేసి వాటి ద్వారా ఆరోగ్య భద్రత ఇచ్చేందుకే సంజీవని ప్రాజెక్టు చేపట్టాం అన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి రాష్ట్రస్థాయి వరకూ డేటా అనుసంధానం అవుతుందని తెలిపారు సీఎం. ప్రతీ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ ను సంజీవని ద్వారా నమోదు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో 80 లక్షల మంది తీవ్ర వ్యాధుల బారిన పడినట్టు నివేదికలు వచ్చాయని వెల్ల‌డించారు. ఔషధాలు, పౌష్టికాహారం లాంటి అంశాలను టెలి కన్సల్టేషన్ ద్వారా వైద్య నిపుణులు సేవలు అందిస్తారని తెలిపారు .

కుటుంబంలోని ప్రతీ ఒక్కరికీ ఆభా హెల్త్ ఐడీ జారీ చేస్తున్నాం, ఆరోగ్య సేవల కోసం హెల్త్ ఎక్స్ యాప్ తీసుకు వస్తున్నాం అని స్ప‌ష్టం చేశారు. సంజీవని ద్వారా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, RCH, RBSK,108 అత్యవసర సేవలు అందిస్తాం అన్నారు. స్క్రీనింగ్ టెస్టులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ-ఔషధి, ల్యాబ్ సేవలు వంటివి ఒకే డిజిటల్ వేదికపైకి తెస్తున్నామ‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.
•భవిష్యత్‌లో AI డాక్టర్ సపోర్ట్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, టెలీమెడిసిన్, రిమోట్ కేర్ సేవలు, డిజిటల్ నర్వ్ సెంటర్ల ద్వారా మరింత ఆధునిక ఆరోగ్య వ్యవస్థను నిర్మిస్తున్నామ‌ని పేర్కొన్నారు. సంజీవని సిటిజన్ వెల్‌నెస్ యాప్ ద్వారా ప్రతి పౌరుడు ఆన్‌లైన్‌లో వైద్యల అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు.

Exit mobile version