హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ జాజును నియమించింది. శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సీఎస్ గా ఉన్న రామకృష్ణ రావు స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఏపీలో చాలా కాలం పాటు సేవలు అందించి కేంద్ర సర్వీసులోకి వెళ్లిన సంజయ్ జాజును పట్టుపట్టి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎస్ గా తీసుకు వచ్చారు. ఇప్పటికే ఏపీకి చెందిన చాలా మంది ఇప్పుడు తెలంగాణలోని కీలక పదవులలో కొలువు తీరారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజాస్వామిక వాదులు.
ఇక సంజయ్ జాజుకు పాలనా పరంగా అపారమైన అనుభవం ఉంది. ఆయన 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, అలాగే పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం కోట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తున్న ఐటీ ఆధారిత ప్రభుత్వ పౌర సేవలు మీసేవ, మున్సిపల్ సేవల్లో పారదర్శకత తీసుకు వచ్చేలా మీ సేవ అనే ప్రాజెక్టును తీసుకు వచ్చారు. సాంకేతికత ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకే చేర్చవచ్చని ఆచరణాత్మకంగా చేసి చూపించారు సంజయ్జాజు. 2014 అక్టోబర్‌లో కేంద్ర డెప్యుటేషన్‌పై వెళ్లిన సంజయ్ జాజు, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన శాఖలలో ఉన్నతాధికారిగా గుర్తింపు పొందారు.


















