Sania Mirza – Tollywood Hero : టాలీవుడ్ హీరోతో సానియా మీర్జా చెట్టాప‌ట్టాల్..?

త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోందంటూ ప్ర‌చారం

Hello Telugu - Sania Mirza - Tollywood Hero

Hello Telugu - Sania Mirza - Tollywood Hero

Sania Mirza : త‌ను టాప్ టెన్నిస్ స్టార్ ప్లేయ‌ర్. హైద‌రాబాద్ కు చెందిన సానియా మీర్జా. పాకిస్తాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ ను పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల పాటు పాకిస్తాన్ , దుబాయ్ లో గ‌డిపింది. ఏమైందో ఏమో కానీ త‌ను వేరే పాక్ మోడ‌ల్ తో డేటింగ్ చేయ‌డంతో ఉన్న‌ట్టుండి త‌నతో విడి పోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత నుంచి త‌ను ఒంట‌రిగా ఉంటోంది. తాజాగా సానియా మీర్జా (Sania Mirza) గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది త‌ను టాలీవుడ్ కు చెందిన ఓ హీరోతో జ‌త క‌ట్టింద‌ని, డేటింగ్ చేస్తోందంటూ. ఈ ఇద్ద‌రూ ఈ మ‌ధ్య‌నే కాఫీ షాప్ లో ద‌ర్శ‌నం ఇవ్వ‌డం , ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాడంతో బంధం మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క బోతున్న‌ట్లు జోరుగా టాక్ ఇటు టాలీవుడ్ లో అటు క్రీడా రంగంలో.

Sania Mirza Marriage Rumors

ఇక సానియా మీర్జాకు ఒక కొడుకు ఉన్నాడు. త‌నే త‌న ప్ర‌పంచం అంటూ ప‌దే పదే చెబుతూ వ‌చ్చింది. ఇక సోద‌రి భారత క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ , మాజీ ఎంపీ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ కొడుకును పెళ్లి చేసుకుంది. కాగా టాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేస్తోందంటూ జాతీయ మీడియా కోడై కూస్తోంది. అయితే స‌ద‌రు న‌టుడు కానీ ఇటు సానియా మీర్జా కానీ ఖండించ లేదు..అలాగ‌ని స్పందించ‌నూ లేదు. ఈ విష‌యం తెలియ‌గానే టాలీవుడ్ హీరో ఎవ‌రా అని తెగ వెతుకుతున్నారు నెట్టింట్లో. ప్ర‌స్తుతం తాను ప్ర‌శాంత‌త‌ను కోరుకుంటున్న‌ట్లు తెలిపారు సానియా. త‌ను కుమారుడు ఇజాన్ మీర్జాతో క‌లిసి దుబాయ్ లో నివ‌సిస్తోంది.

Also Read : TG B Tech- B Category Interesting Update : రేప‌టి నుంచి ఇంజ‌నీరింగ్ బి – కేట‌గిరి అడ్మిష‌న్స్

Exit mobile version