Spirit : అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు దర్శకుడు వంగా సందీప్ రెడ్డి, డార్లింగ్ ప్రబాస్ కాంబినేషన్ లో రూపు దిద్దుకునే సినిమా కోసం. ఇప్పటికే పోస్టర్ ను కూడా ప్రకటించాడు. మనోడు దమ్మున్న డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా వినిపించడం, దానికి ప్రభాస్ ఓకే చెప్పడం కూడా జరిగింది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ ఖర్చుతో దీనిని తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించాడు వంగా సందీప్ రెడ్డి. తను ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఇక వెనుదిరగడు.
Darling Prabhas Spirit Movie Updates
అయితే సినిమా ప్రకటన తర్వాత కొంత వివాదాస్పదం కూడా అయ్యింది. ముందుగా లవ్లీ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాడు. తనకు కంటిన్యూగా విరామం అన్నది లేకుండా షూటింగ్ కు సంబంధించి డేట్స్ కావాలని కోరాడు. దీనికి అభ్యంతరం తెలిపింది నటి. బహిరంగంగానే వంగా సందీప్ రెడ్డిపై కామెంట్స్ చేయడం కలకలం రేపింది. దీనిపై స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చాడు దర్శకుడు. ఆ తర్వాత యానిమల్ మూవీలో తాను తీసుకున్న నటి త్రిప్తి దిమ్రీని హీరోయిన్ గా ప్రకటించాడు. అయితే దీపికా పదుకొనే ఏకంగా రూ. 20 కోట్లు డిమాండ్ చేసిందని, అందుకే తనను పక్కన పెట్టానంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిని తర్వాత ఖండించింది దీపికా పదుకొనే.
తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి నుంచి. స్పిరిట్ (Spirit) సినిమా సెప్టెంబర్ చివరి నాటికి అధికారికంగా పూజా కార్యక్రమం జరగనుంది. మొదటి షెడ్యూల్ విదేశీ షూటింగ్ తో ప్రారంభమవుతుంది. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం మెక్సికో, ఇండోనేషియా, మలేషియా , బ్యాంకాక్ లలో లొకేషన్లను పరిశీలిస్తున్నాడు. ప్రభాస్ నవంబర్ లో షూటింగ్ లో జాయిన్ అవుతాడని భావిస్తున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. త్రిప్తి దిమ్రి ఇందులో హీరోయిన్.
Also Read : MLA Komatireddy Raj Gopal Warning : మునుగోడుకు అన్యాయం జరిగితే ఊరుకోను


















