న్యూఢిల్లీ : ఎంసీఏ, డీజీసీఏ కోలుకోలేని షాక్ ఇచ్చింది ఎయిర్ ఇండియాకు. ఈ మేరకు సీఈవో క్యాంప్ బెల్ విల్సన్ కు నోటీసులు జారీ చేసింది. తక్షణమే తమ ముందు హాజరు కావాలని, వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో దెబ్బకు మనోడు , ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఏ, డీజీసీఏ అధికారులతో భేటీ అయ్యారు. ఆగస్టు 4న ఢిల్లీ-ఫుకెట్ విమానం AI2379కు సంబంధించి జరిగిన ఘటన నేపథ్యంలో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ముగ్గురు సీనియర్ ఎయిర్‌లైన్ అధికారులను సమావేశానికి పిలిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత వారం ఫుకెట్-ఢిల్లీ విమానంలో ప్రయాణ సమయంలో ఎదురైన తీవ్రమైన కుదుపుల కారణంగా కనీసం 17 మంది గాయపడిన ఘటనకు సంబంధించి నోటీసు జారీ చేసింది. ఎయిర్ ఇండియా సీఈఓ , ఇతర సీనియర్ అధికారులు పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా , ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
టాటా సన్స్ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ , మాజీ పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా, అలాగే ఎయిర్ ఇండియా ఫ్లైట్ సేఫ్టీ హెడ్ దీపక్ జోషి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆగస్టు 4న జరిగిన ఢిల్లీ-ఫుకెట్ విమానం AI2379 ఘటన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పౌర విమానయాన శాఖ కార్యదర్శితో పాటు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ , డైరెక్టర్ జనరల్ వీర్ విక్రమ్ యాదవ్ , ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ జి.వి.జి. యుగంధర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి సంబంధించిన నిర్దిష్ట వివరాలు వెంటనే తెలియ రాలేదు. ఖరోలా ప్రస్తుతం టాటా సన్స్ , ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా సంస్థ టాటా , సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉమ్మడి యాజమాన్యంలో ఉంది.
ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీగా ఉన్న విల్సన్ రాజీనామా చేశారు . వచ్చే నెలలో సంస్థ నుంచి వైదొలగనున్నారు. ఆగస్టు 4న, A320 విమానం (VT-EXO) ద్వారా నడిపిన ఫుకెట్-ఢిల్లీ విమానం AI2379, ప్రయాణ సమయంలో 300 అడుగుల ఎత్తును అకస్మాత్తుగా కోల్పోయింది; ఆ తర్వాత విమానం స్థిరపడి, సురక్షితంగా రాజధానిలో ల్యాండ్ అయింది. ఈ ఘటనలో నలుగురు క్యాబిన్ సిబ్బందితో సహా కనీసం 17 మంది గాయపడ్డారు. దీనిపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తోంది.
