బెంగళూరు : కర్ణాటక సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప. సోమవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. సర్ లోపాలతో సంబంధం లేని వారిపై చర్యలు తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నిర్ణయాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఎన్డీఏ ప్రతినిధి బృందంతో కలిసి గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్ కోరామని, మంగళవారం టైం ఇచ్చారని తెలిపారు మాజీ సీఎం. కలబురిగి: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎటువంటి తప్పు చేయని వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నాలను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఖండించారు. ఈ విషయంలో, తప్పులు లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగిన చోట అధికారులు చర్యలు తీసుకోవాలని, అయితే ఎటువంటి అక్రమాలకు బాధ్యులు కాని వారిపై చర్యలు తీసుకోవడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని యడియూరప్ప అన్నారు. ”
తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని మేము చాలా రోజులుగా చెబుతూనే ఉన్నామని చెప్పారు యెడ్యూరప్ప. కానీ ఎటువంటి తప్పు చేయని వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించడం ఖండించదగినది అని ఆయన అన్నారు. సర్ ప్రక్రియలో జరిగినట్లు ఆరోపించ బడుతున్న అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ చేపట్టిన నిరసనపై స్పందించారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించడం మంచి పద్దతి కాదన్నారు.
