Sajjanar Travel Interesting : సిటీ బ‌స్సులో స‌జ్జ‌నార్ ప్ర‌యాణం

స్వ‌యంగా టికెట్ తీసుకున్న ఎండీ

Hello Telugu - Sajjanar Travel Interesting

Hello Telugu - Sajjanar Travel Interesting

Sajjanar : హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ఉన్న వీసీ స‌జ్జ‌నార్ ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న‌ను హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ కమిష‌న‌ర్ గా నియ‌మించింది. స‌జ్జ‌నార్ స్థానంలో సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా నియ‌మించింది. దీంతో చివ‌రి రోజు కావ‌డంతో స‌జ్జ‌నార్ (Sajjanar) ఎండీగా కాకుండా కేవ‌లం సాధార‌ణ ప్ర‌యాణీకుడిలా రోడ్డు పైకి వ‌చ్చారు. కేవలం సాధార‌ణ ప్ర‌యాణీకుడిలా సిటీ బ‌స్సు ఎక్కారు. స్వ‌యంగా తాను కూడా తోటి ప్ర‌యాణీకుల‌తో పాటే టికెట్ తీసుకున్నారు. యూపీఐ ద్వారా డ‌బ్బులు చెల్లించారు వీసీ స‌జ్జ‌నార్. ఈ సంద‌ర్బంగా బ‌స్సులో ఉన్న వారితో మాట్లాడారు. ఆర్టీసీ అందిస్తున్న సేవ‌లు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు.

IPS Sajjanar  Travel

తాను మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చారు. డిజిట‌ల్ టికెటింగ్ ను ప్రోత్స‌హించారు. లాజిస్టిక్ సేవ‌ల‌ను ప్రారంభించారు. దీని కార‌ణంగా ఆర్టీసీకి కొంత మేర ఆదాయం ల‌భించింది. ఆయ‌న హ‌యాంలోనే ప్ర‌భుత్వం ఫ్రీ టికెట్ బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని అద్భుతంగా అమ‌లు చేశారు. అంతే కాకుండా ఆర్టీసీని న‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. ఆయ‌న స్థానంలో కొత్త‌గ‌గా నియ‌మితుల‌య్యారు సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ నాగిరెడ్డి. స‌జ్జ‌నార్ నుంచి ఎండీగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆయ‌న ముందు ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయి.

Also Read : Accenture Huge Layoffs : ప్రముఖ ఐటీ సంస్థ ‘యాక్సెంచర్‌’ లో భారీగా ఉద్యోగాల తొలగింపు

Exit mobile version