Saiyaara Movie Success : వ‌సూళ్ల వేట‌లో దూసుకు పోతున్న సైయారా

రూ.300 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ సెన్సేష‌న్

Hello Telugu - Saiyaara Movie Success

Hello Telugu - Saiyaara Movie Success

Saiyaara : మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం సైయారా. విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా దుమ్ము రేపుతోంది. యూత్ తో పాటు అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్రేక్ష‌కులంతా సినిమాను చూసేందుకు ఎగ‌బ‌డుతున్నారు. ప్ర‌స్తుతం సినీ వ‌ర్గాల ప్ర‌కారం 20 రోజుల వ‌ర‌కు రూ. 306 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇది బాలీవుడ్ లోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. బాక్సులు బ‌ద్ద‌లు అవుతున్నాయి. దీంతో పోటీ ప‌డ‌లేక భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన మూవీస్ కూడా క‌లెక్ష‌న్ల కోసం తిప్ప‌లు ప‌డుతున్నాయి. విచిత్రం ఏమిటంటే అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన స‌న్ ఆఫ్ స‌ర్దార్ కంటే ఎక్కువ‌గా వ‌సూలు కావ‌డం విస్తు పోయేలా చేసింది.

Saiyaara Movie Record Collections

కాగా ఈ ఏడాది విడుద‌లైన సినిమాల‌లో సైయారా (Saiyaara) దూసుకు పోయింది. టాప్ లో నిలిచింది వ‌సూళ్ల ప‌రంగా . ఈ మూవీ గ‌త నెల జూలై 18న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రికార్డుల మోత మోగిస్తోంది. కాగా విడుదలైన ఇరవై రోజుల తర్వాత, ఈ చిత్రం మూడవ బుధవారం నాడు రూ. 2 కోట్లు వసూలు చేసి, మొత్తం రూ. 306.60 కోట్లకు చేరుకుందని సాక్నిల్క్ సంస్థ తెలిపింది. విక్కీ కౌశల్ ఛావా తర్వాత ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ చిత్రంగా సైయారా నిలిచింది. ఈ సినిమా ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు చేసిన ప్రారంభ వారాంతాల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద, ఇది ఇప్పటికే రూ. 450 కోట్ల మార్కును దాటింది.

ద‌ర్శ‌కుడు మోహిత్ సూరి మొత్తంగా ప్రేమ క‌థ‌ను అద్భుతంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ఇందులో న‌టించిన న‌టీ న‌టుల న‌ట‌నకు జ‌నం ఫిదా అయ్యారు.

Also Read : Minister BC Janardhan Reddy Alarming : రైతుల‌కు యూరియా కొర‌త లేకుండా చేస్తాం

Exit mobile version