Popular Director Sandeep Reddy Vanga-Saiyaara : వంగా సందీప్ రెడ్డికి మోహిత్ సూరి థ్యాంక్స్

సైయారా మూవీకి మ‌ద్ద‌తు ఇచ్చినందుకు

Hello Telugu - Popular Director Sandeep Reddy Vanga-Saiyaara

Hello Telugu - Popular Director Sandeep Reddy Vanga-Saiyaara

Sandeep Reddy Vanga : తాజాగా విడుద‌లైన సైయారా రొమాంటిక్ ప్ర‌ధాన క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను త‌ల‌ద‌న్నేలా దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల పంట పండిస్తోంది. విడుద‌లైన వారం రోజుల్లోనే రూ. 172 కోట్ల‌కు పైగా వ‌సూలు సాధించింది. ఔరా అని ఆశ్చ‌ర్య పోయేలా చేసింది ఈ మూవీ. ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు మోహిత్ సూరిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga). అద్భుతంగా తీశావంటూ కితాబు ఇచ్చారు.

Saiyaara Director Thanks to Sandeep Reddy Vanga

త‌న గురించి స్టార్ డైరెక్ట‌ర్ ఇలా ప్రోత్స‌హిస్తూ, మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు సైయారా ద‌ర్శ‌కుడు. తాను వంగా నుంచి ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అనుకోలేద‌న్నాడు. త‌ను చేసిన సూచ‌న‌ల‌ను, అభినంద‌న‌ల‌ను ఎల్ల‌ప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటాన‌ని స్ప‌ష్టం చేశాడు. వంగా లాంటి సృజ‌నాత్మ‌క‌త క‌లిగిన ద‌ర్శ‌కుడి నుంచి ప్ర‌శంస అందుకోవ‌డం మామూలు విష‌యం కాద‌న్నాడు విన‌యంగా మోహిత్ సూరి.

ఈ ఒక్క సైయారా మూవీతో ఎవరిత‌ను అంటూ నెటిజ‌న్లు , ఫ్యాన్స్ వెద‌క‌డం ప్రారంభించారు. అంత‌లా ఆక‌ట్టుకునేలా తీశాడు సినిమాను. పూర్తిగా ప్రేమ క‌థా చిత్రంగా మార్చేశాడు. ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు, భావోద్వేగాల‌ను తెర‌పై అద్భుతంగా పండించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. అందుకే మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. సైయారా మూవీలో అహాన్ పాండే, అనీత్ ప‌ద్దా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఒక ర‌కంగా చెప్పాలంటే త‌మ‌కు ఇచ్చిన పాత్ర‌ల్లో జీవించారు. నూత‌న ద‌ర్శ‌కుడు సాధించిన అపూర్వ విజ‌యం ఇది. సైయారాకు బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ఇచ్చిన వ్య‌క్తిగా వంగా సందీప్ రెడ్డి నిలిచాడు. ఈ సినిమా పూర్తిగా మోహిత్ సూరిదేనంటూ పేర్కొన్నాడు.

Also Read : Saiyaara Sensational Collections : సైయారా వారెవా క‌లెక్ష‌న్స్ అదుర్స్

Exit mobile version