Saiyaara : పూర్తి రొమాంటిక్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సైయారా. ఎవరూ ఊహించని విధంగా బాక్సులు బద్దలు కొడుతోంది. సినిమా విడుదలై వారం రోజులు గడిచినా ఇంకా థియేటర్లు హౌస్ ఫుల్ తో నడుస్తుండడం విశేషం. రిలీజైన నాటి నుంచి నేటి దాకా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. రాబోయే రోజులలో భారీ ఎత్తున కాసులు వసూలు చేసేందుకు దూసుకు పోతోంది. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు సైయారా మూవీ కలెక్షన్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి. ఏకంగా ఈ మూవీ రూ. 170 కోట్లను దాటేసింది.
Saiyaara Movie Collections
సైయారాను (Saiyaara) అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మోహిత్ సూరి. ఇందులో అహాన్ పాండే, అనీత్ పద్దా నటించారు. ఈ ప్రేమకథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా చేసింది. ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే సైయారా మొదటి రోజు రూ. 21.5 కోట్లు, 2వ రోజు రూ. 26 కోట్లు, 3వ రోజు రూ.35.75 కోట్లు, 4వ రోజు రూ. 24 కోట్లు, 5వ రోజు రూ.25 కోట్లు వసూలు చేసింది. ఇక 6వ రోజు రూ21.5 కోట్లు , 7వ రోజు రూ. 18.75 కోట్లు సాధించింది. మునుపటి రోజు కలెక్షన్ల కంటే సంఖ్యలు అటు ఇటుగా ఉన్నప్పటికీ సైయారా మూవీ కలెక్షన్స్ ఇప్పటి దాకా డబుల్ డిజిట్స్ కు తగ్గక పోవడం విశేషం.
ఇదిలా ఉండగా సైయారా (Saiyaara) మరో రికార్డును సృష్టించింది. గతంలో కరుణ్ జోహార్ తీసిన రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ కలెక్షన్స్ ను తక్కువ రోజుల్లోనే అధిగమించింది సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఈ మూవీ వారం రోజుల్లో ఆనాడు రూ. 153.55 కోట్లు సాధించింది. ఈ చిత్రం 2023లో విడుదలైంది. ఇందులో రణ వీర్ సింగ్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సైయారా దర్శకుడు మోహిత్ సూరి చర్చనీయాంశంగా మారాడు.
Also Read : Hero Pawan – Hari Hara Veera Mallu Collections : పవన్ కళ్యాణ్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
