Saiyaara Movie Success : రూ. 500 కోట్లు దాటేసిన సైయారా రికార్డ్

మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వంలో మూవీ సెన్సేష‌న్

hellotelugu-saiyaara

Saiyaara : బాలీవుడ్ నే కాదు యావ‌త్ భార‌త దేశాన్ని ఊపేస్తోంది మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సైయారా చిత్రం. విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా బాక్సుల‌ను నింపేస్తోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ఏకంగా ఈ చిత్రం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రూ. 500 కోట్ల‌ను దాటేసింది. ఈ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు బాలీవుడ్ లో టాప్ డైరెక్ట‌ర్ అయిన మ‌హేష్ భ‌ట్ కు స్వయానా మేన‌ల్లుడు . సైయారాను (Saiyaara) అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. ప్ర‌ధానంగా ప్రేమ క‌థ‌ను అద్బుతంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు మోహిత్ సూరి. యువ‌త క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు. థియేట‌ర్ల‌లోనే ప‌డి పోతున్నారు. ఇది కూడా విస్తు పోయేలా చేసింది సినీ వ‌ర్గాల‌ను.

Saiyaara Movie Record Collections

గ‌తంలో ఇలాంటి మూవీస్ చాలానే వ‌చ్చాయి. కానీ ఇంత‌లా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కొత్త వాళ్ల‌ను తీసుకుని ప్ర‌యోగం చేశాడు ద‌ర్శ‌కుడు. మూడు వారాల‌లోపే రికార్డ్ స్థాయిలో క‌లెక్ష‌న్స్ సాధించింది సైయారా మూవీ. గ‌త నెల జూలై 18న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు అహాన్ పాండే, అనీత్ ప‌డ్డా. వారు త‌మ పాత్ర‌ల‌లో లీన‌మై న‌టించారు. ప్రాణం పోశారు. కంట‌త‌డి పెట్టించారు. ఇక సంగీతం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. పాట‌లు ఇప్ప‌టికీ ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నాయి. ద‌ర్శ‌కుడు మోహిత్ సూరి సైయారాను పూర్తిగా ల‌వ్ అండ్ మ్యూజిక‌ల్ స్టోరీగా తెర‌కెక్కించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. త‌న ఫార్ములా స‌క్సెస్ అయ్యింది. అది వంద‌ల కోట్ల‌ను వ‌సూలు చేసేలా చేసింది.

Also Read : Uyi Amma Song Sensational : ఊపేస్తున్న ఉయ్ అమ్మా సాంగ్

Exit mobile version