అనిరుధ్ కావ్య మార‌న్ రిసెప్ష‌న్ కు ధ‌నుష్ డుమ్మా

మ్యూజిక్ డైరెక్ట‌ర్ న‌టుడి మ‌ధ్య స‌వ్యంగా లేదా

hellotelugu-Dhanush

చెన్నై : ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ అగ్ర న‌టుడు ధ‌నుష్ కు మ‌ధ్య చెడిందా . ఇదే విష‌యం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రాక్ స్టార్ గా గుర్తింపు పొందిన అనిరుధ్ ర‌విచంద‌ర్ , స‌న్ రైజర్స్ జ‌ట్టు య‌జ‌మాని కావ్య మార‌న్ లో గ్రీస్ న‌గ‌రంలో ఇటీవ‌లే ఒక్క‌ట‌య్యారు. ఇదిలా ఉండ‌గా తాజాగా చెన్నైలో ఈ ఇద్ద‌రికి సంబంధించిన రిసెప్ష‌న్ గ్రాండ్ గా జ‌రిగింది. దేశ‌, విదేశాల‌కు చెందిన న‌టీన‌టులు, ప్ర‌ముఖులు, క్రీడా, సినీ, రాజ‌కీయ‌, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన వారంతా హాజ‌ర‌య్యారు. నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. అయితే ఈ రిసెప్ష‌న్ వేడుక‌కు అంద‌రూ ద‌నుష్ వ‌స్తాడ‌ని భావించారు. కానీ తీరా చూస్తే ఆయ‌న మిస్ అయ్యారు. దీంతో అనిరుధ్, ధ‌నుష్ మ‌ధ్య అంత‌గా సంబంధాలు బాగా లేవ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది పెద్ద ఎత్తున‌. ఇదే హాట్ టాపిక్ గా మారింది కూడా.

అంత‌కు ముందు జ‌రిగిన పెళ్లికి కూడా ధ‌నుష్ హాజ‌రు కాలేదు. ధ‌నుష్, కావ్య మార‌న్ లు న‌వంబ‌ర్ 11న గ్రీస్ లో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాల‌కు చెందిన వారే హాజ‌ర‌య్యారు. కేవలం సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే హాజరైన ఈ వేడుకకు, నటుడు ధ‌నుషు కుమారులు కూడా హాజరయ్యారు. దీంతో చెన్నైలో జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌కు ధనుష్ వస్తారని అభిమానులు ఆశించారు. కానీ, ఆయన హాజరు కాక పోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నటుడు ధనుష్, అనిరుధ్‌ల మధ్య ఉన్న స్నేహ బంధం గురించి తమిళ సినీ అభిమానులకు తెలిసిందే. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘3’ సినిమాతో అనిరుధ్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలోని ‘వై దిస్ కొలవెరి డి’ అనే పాటను ధనుష్ రాయడమే కాకుండా పాడారు కూడా; ఇది ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందనను అందుకుంది.

ఒకే పాటతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన అనిరుధ్‌కు, ఆ సినిమా సినీ పరిశ్రమలో ఒక బలమైన గుర్తింపును ఇచ్చింది. ఆ తర్వాత కూడా ధనుష్ నటించిన అనేక చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందించారు. వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఇలాంటి తరుణంలో సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ప్రవేశించి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనిరుధ్ రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్ట్‌లో ధనుష్ గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడాన్ని గమనించిన నెటిజన్లు, ఆ విషయాన్ని విమర్శిస్తున్నారు.

Exit mobile version