Uyi Amma Song Sensational : ఊపేస్తున్న ఉయ్ అమ్మా సాంగ్

ర‌వీనా టాండ‌న్ కూత‌రు సెన్సేష‌న్

Hello Telugu - Uyi Amma Song Sensational

Hello Telugu - Uyi Amma Song Sensational

Uyi Amma : త‌ల్లిని మించిన త‌న‌యురాలిగా పేరు తెచ్చుకుంది రాషా త‌డానీ. త‌ను తాజ‌గా న‌టించిన చిత్రం ఆజాద్. ఇందులో కంపోజ్ చేసిన సాంగ్ ఉమ్ అమ్మా (Uyi Amma) సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా సోష‌ల్ మీడియాలో, యూట్యూబ్ లో టాప్ లో కొన‌సాగుతోంది. మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ వ‌స్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. లెక్క‌లేన‌న్ని కామెంట్స్ కూడా వ‌స్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఈ సినిమా త‌న‌కు కొత్త‌ది కావ‌డం. త‌న సినీ కెరీర్ ఆజాద్ నుంచి ప్రారంభ‌మైంది. ఉయ్ అమ్మా పాట‌ను అమితాబ్ భ‌ట్టాచార్య రాశాడు. పాట‌ను మధుబంతి బాగ్చి అద్భుతంగా పాడింది. అమిర్ త్రివేది పాటకు స్వ‌ర క‌ల్ప‌న చేశారు. కొరియోగ్రాఫర్ బోస్కో లెస్లై మార్టిస్ అందించాడు. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఉయ్ అమ్మా ఊపేస్తోంది.

Uyi Amma Song Sensational

ఈ సంద‌ర్బంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో జ‌నాద‌ర‌ణ పొందుతుండ‌డంతో స్పందించింది న‌టి రాషా త‌డానీ. ఈ పాట కోసం చాలా క‌ష్ట ప‌డ్డాన‌ని, ఈ క్రెడిట్ త‌న‌ది కాద‌ని త‌న త‌ల్లి , న‌టి ర‌వీనా టాండ‌న్ ద‌ని చెప్పింది. త‌ను 1990లో టాప్ హీరోయిన్ గా పేరు పొందింది. ఇటు తెలుగులో అటు హిందీలో దుమ్ము రేపింది. పాట కోసం త‌న త‌ల్లి ఎలా డ్యాన్స్ చేయాలో ద‌గ్గ‌రుండి నేర్పించింద‌ని ఇంత గొప్ప‌గా రావ‌డానికి త‌నే కార‌ణ‌మ‌ని తెలిపింది. ఆజాద్ మూవీలో ప్ర‌ముఖ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్ మేన‌ల్లుడు ఆమ‌న్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న ఆజాద్ తో అరంగేట్రం చేసింది. రాషా త‌డాని హావభావాలకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి, ముఖ్యంగా ఆమె డ్యాన్స్ నంబర్ ఉయ్ అమ్మా హావభావాలు ఆజాద్‌లో ప్రధాన హైలైట్ గా నిలిచాయి

Also Read : Minister Bandi Sanjay Warning : బండి సంజ‌య్ జ‌ర నోరు జాగ్ర‌త్త – కేటీఆర్

Exit mobile version