Saina Nehwal : హైదరాబాద్ – ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా తన భర్త బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తో విడి పోతున్నట్లు తెలిపింది. ఈ ఇద్దరూ కలిసి ఏడేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. ఎందుకు విడి పోతున్నామనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు సైనా, కశ్యప్. ఈ ఇద్దరూ కలిసి నవంబర్ 14, 2018లో పెళ్లి చేసుకున్నారు ఘనంగా. ఆరేళ్లకు పైగా కలిసి కాపురం చేశారు. కానీ ఎందుకనో వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. దీంతో సైనా నెహ్వాల్ (Saina Nehwal) కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతి, ప్రేమ, ఒంటరిగా ఉండేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేసింది.
Saina Nehwal Divorced with Kashyap Parupalli
సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇద్దరూ కలిసి హైదరాబాద్ లోని పుల్లెల గోపిచంద్ అకాడెమీలో కలిసి శిక్షణ పొందారు. సెహ్వాల్, మాజీ షట్లర్ అయిన పారుపల్లి కశ్యప్ అన్యోన్యంగానే ఉన్నారు. కానీ ఏమైందో కానీ ఇన్ స్టా వేదికగా విడి పోతున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. ఈ సందర్బంగా ఓ కామెంట్ చేసింది. జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకు వెళుతుందని పేర్కొంది సైనా నెహ్వాల్. చాలాసార్లు ఆలోచించాను. ఇక తనతో బంధం కుదరదని తేలి పోయిందని , అందుకే కశ్యప్ నుంచి విడి పోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇదంతా నా వరకు , నా కుటుంబానికి కాసింత శాంతి కావాలన్నదే నా కోరిక అని తెలిపింది.
Also Read : Senior Actress Saroja Devi Death : సీనియర్ నటి సరోజాదేవి ఇక లేరు
