Saroja Devi : ప్రముఖ సీనియర్ నటి సరోజా దేవి సోమవారం బెంగళూరు మల్లేశ్వరంలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 87 ఏళ్లు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఆమె మృతి పట్ల సినీ రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కన్నడ సినిమా రంగంలో తొలి మహిళా సూపర్ స్టార్ గా బి. సరోజా దేవి (Saroja Devi) పేరు పొందారు. తను 17 ఏళ్ల వయసులో 1955లో కన్నడ సినిమా మహా కవి కాళిదాసుతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు.
Senior Actress Saroja Devi No More
తను అన్ని భాషలలో కలిపి మొత్తం 200కు పైగా సినిమాలలో నటించారు. బి. సరోజా దేవి తమిళ చిత్రం నాదోడి మన్నన్ (1958)తో కీర్తిని పొందారు, అందులో ఆమె ఎంజీ రామచంద్రన్ సరసన నటించారు.
ఈ సినిమా విజయం ఆమెను ఇంటి పేరుగా మార్చేలా చేసింది. తమిళ సినిమాల్లో ఆమె విజయవంతమైన ప్రస్థానం ప్రారంభమైంది.
సరోజా దేవి శివాజీ గణేషన్, జెమిని గణేషన్, ఎన్.టి. రామారావు, రాజ్ కుమార్, రాజేంద్ర కుమార్, షమ్మీ కపూర్ వంటి ప్రముఖ నటులతో కూడా నటించారు. 1955, 1984 మధ్య వరుసగా 161 చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించిన ఘనతను ఆమె కలిగి ఉన్నారు. ఇది భారతీయ సినిమాల్లో సాటిలేని రికార్డుగా నమోదైంది. బి. సరోజా దేవి మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తమిళ సినీ స్టార్ రజనీకాంత్, ఖుష్బూ , సుందర్ , తళపతి విజయ్, మెగాస్టార్ చిరంజీవి.
Also Read : Hero Rajinikanth Coolie Movie : కోలీవుడ్ ను షేక్ చేస్తున్న రజనీ కూలీ మేనియా
