S Jaishankar Interesting Comments : కీల‌క వాణిజ్య స‌మ‌స్య‌ల‌పై భార‌త్ కు చైనా హామీ

మంత్రి జై శంక‌ర్ తో చైనా మంత్రి వాంగ్ యి

Hello Telugu - S Jaishankar Interesting Comments

Hello Telugu - S Jaishankar Interesting Comments

S Jaishankar : ఢిల్లీ – నిన్న‌టి దాకా క‌య్యానికి కాలు దువ్విన చైనా ఉన్న‌ట్టుండి మ‌న‌సు మార్చుకుంది. భార‌త్ తో సృహుద్భావ‌మైన వాతావ‌ర‌ణంలో దోస్తీకి సై అంది మ‌రోసారి. ఇందులో భాగంగా చైనా దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్త్ం ఇండియాకు విచ్చేశారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు కేంద్ర మంత్రి జై శంక‌ర్ (S Jaishankar). ఈ సంద‌ర్బంగా ఈ ఇద్ద‌రూ సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇందులో ప్ర‌ధానంగా ఆర్థిక‌, వాణిజ్య స‌మ‌స్య‌లు, స‌రిహ‌ద్దు వివాదాల గురించి చ‌ర్చించారు. అరుదైన భూములు, ఎరువులు, టన్నెల్ బోరింగ్ యంత్రాలను పరిష్కరిస్తామని చైనా హామీ ఇచ్చినట్లు కేంద్ర వ‌ర్గాలు వెల్ల‌డించాయి. నదుల డేటా భాగస్వామ్యం, సరిహద్దు వాణిజ్యం, కనెక్టివిటీ , ద్వైపాక్షిక మార్పిడి గురించి విస్తృతంగా చ‌ర్చించారు.

Union Minister S Jaishankar Key Comments

జూలైలో చైనా పర్యటన సందర్భంగా జైశంకర్ లేవనెత్తిన ఆందోళనలను కూడా ప‌రిష్క‌రించేందుకు హామీ ఇచ్చారు వాంగ్ యి. పొరుగు దేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా, భారతదేశం , చైనా నిర్బంధ వాణిజ్య చర్యలు , అడ్డంకులను నివారించాలని జైశంకర్ తన ప్రారంభ వ్యాఖ్యలలో నొక్కి చెప్పారు. రెండు దేశాల మధ్య స్థిరమైన , నిర్మాణాత్మక సంబంధాలు వారికి మాత్రమే కాకుండా ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తాయని స్ప‌ష్టం చేశారు. విభేదాలు వివాదాలుగా మారకూడదని, పోటీ సంఘర్షణకు దారి తీయకూడదని కూడా మంత్రి జైశంక‌ర్ పేర్కొన్నారు. వాంగ్ యి పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి, ప్రపంచ పరిస్థితి , పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించిందని అన్నారు.

Also Read : Palla Srinivas Clear Instructions : గీత దాటితే వేటు త‌ప్ప‌దు : ప‌ల్లా

Exit mobile version