Palla Srinivas Clear Instructions : గీత దాటితే వేటు త‌ప్ప‌దు : ప‌ల్లా

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు శ్రీ‌నివాస‌రావు

Hello Telugu - Palla Srinivas Clear Instructions

Hello Telugu - Palla Srinivas Clear Instructions

Palla Srinivas : అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర‌ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు (Palla Srinivas) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్రజలతో దురుసుగా వ్యవహరించినా, అధికార దుర్వనియోగం చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. నాయకులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రతి టీడీపీ ప్రజాప్రతినిధిని గమనిస్తున్నామ‌ని, తప్పు చేసిన వాళ్లు ఎంత పెద్దవారైనా ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. తాము సమాజానికి బాధ్య‌త వ‌హిస్తున్నామ‌ని గుర్తించాల‌న్నారు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు. మంగ‌ళ‌వారం టీడీపీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. గ‌త కొన్ని రోజులుగా కొంద‌రు ప్ర‌జా ప్ర‌తినిధులు నోరు పారేసు కోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

TDP Chief Palla Srinivas Key Comments

రైతుల‌కు సంబంధించి వ‌క‌ల్తా పుచ్చుకున్న ఎమ్మెల్యే తీరు కూడా క‌ల‌క‌లం రేపింది. దీనిపై సీరియ‌స్ అయ్యారు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవ‌రైనా స‌రే, ఎంత‌టి వారైనా స‌రే, ఏ స్థానంలో ఉన్నా స‌రే ఊరుకునేది లేద‌న్నారు. దీంతో దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగారు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు. ఇదే స‌మ‌యంలో ఉన్న‌ట్లుండి అనంత‌పురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ద‌గ్గుబాటి ప్ర‌సాద్ చేసిన కామెంట్స్ మ‌రింత వివాదానికి దారి తీసేలా చేశాయి. త‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన వార్ -2 స‌రిగా ఆడ‌దంటూ బూతులు మాట్లాడిన వీడియో వైర‌ల్ గా మారంది. దీంతో నిత్యం క్ర‌మశిక్ష‌ణ‌కు మారు పేరుగా చెప్పే టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్ప‌డం విస్తు పోయేలా చేసింది.

Also Read : Ex IAS Vijay Kumar Strong Demands : పవన్ కళ్యాణ్ పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి

Exit mobile version