హైదరాబాద్ : ప్రపంచ క్రికెట్ ను శాసిస్తూ వేల కోట్ల ఆదాయన్ని సమకూర్చేలా చేస్తున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ఫౌండర్ లలిత్ మోడీ. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఇంగ్లండ్ లో తలదాచుకున్నారు. ఇదిలా ఉండగా లలిత్ మోడీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం లభించింది. దీంతో కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ కూటమి మోదీ సర్కార్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక లలిత్ మోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వసుంధరా రాజే ప్రభుత్వ హయాంలో అప్పటి ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ తన రాజకీయ పలుకుబడిలో శిఖరాగ్రంలో ఉండేవారు. దౌత్య వర్గాలలో ఆయనను ‘సూపర్ సీఎం’ అని కూడా పిలిచేవారు. భారతదేశంలోని అత్యంత ఖరీదైన ఫైవ్-స్టార్ హోటళ్లలో ఒకటైన జైపూర్‌లోని రాంబాగ్ ప్యాలెస్‌లో ఆయన కోసం ఒక సూట్‌ను ఎల్లప్పుడూ బుక్ చేసేవారు. ఆయన అక్కడి నుంచే అధికారులకు ఆదేశాలు జారీ చేసేవారు.
లలిత్ మోడీ ఈరోజు అధికారికంగా బ్రిటిష్ పౌరసత్వం పొందడంతో భారతదేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ తగిలింది. 16 సంవత్సరాల క్రితం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి భయపడి లండన్‌కు పారిపోయాడు లలిత్ మోడీ, తనకు తాజాగా బ్రిటిష్ సర్కార్ పౌరసత్వాన్ని ప్రకటించడంతో స్పందించాడు. బ్రిటన్‌లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనియన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు నేను చాలా గర్వంగా భావిస్తున్నాను అని అన్నారు. అయితే జైపూర్‌లోని అమెర్ ప్రాంతంలో చారిత్రక భవనాల కొనుగోలు, అలాగే మాజీ ముఖ్యమంత్రి కుమారుడు దుష్యంత్ సింగ్‌కు చెందిన ‘నియంత్ హెరిటేజ్’ కంపెనీకి సంబంధించిన కోట్ల రూపాయల పెట్టుబడులు , లావాదేవీల విషయంలో లలిత్ మోడీ రాజస్థాన్ రాజకీయాల్లోని ప్రధాన వివాదాలకు కేంద్రంగా ఉన్నారు.భారతదేశానికి తిరిగి రావడం విషయంలో ఈడీ కేసులు, మోదీ ప్రభుత్వం గురించి అడిగినప్పుడు లలిత్ మోదీ డోంట్ కేర్ అని పేర్కొనడం ఇప్పుడు చర్చకు దారితీసింది.



















