Rukmini Vasanth : ప్రస్తుతం రుక్మిణి వసంత్ చర్చనీయాంశంగా మారింది. తను హాట్ టాపిక్ గా సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. తను అందాల ముద్దుగుమ్మగా పేరు పొందింది. టాప్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ . తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్, శాండిల్ వుడ్ నుంచి యష్ , రిషబ్ శెట్టిలతో బిగ్ ప్రాజెక్టులలో కీ రోల్ పోషించనుంది. ఇదిలా ఉండగా ఈ నటి సప్త సాగరదాచే ఎల్లో అనే సినిమాతో గుర్తింపు పొందింది. రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) భారతీయ సినిమాల్లో అత్యంత బిజీగా ఉన్న పేర్లలో ఒకరిగా వేగంగా ఎదుగుతోంది. తనకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. రుక్మిణి వసంత్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించేందుకు ఎంపికైంది.
Rukmini Vasanth Movie Updates
ఇదే సమయంలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న మరో చిత్రం యష్. టాక్సిక్ పేరుతో సినిమా రూపొందుతతోంది. దీనికి గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. ఇందులో కూడా రుక్మిణి వసంత్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇదే సమయంలో శివకార్తికేయన్ హీరోగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మధరసి’ తమిళ తొలి చిత్రం తెలుగు ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత ఎన్.వి. ప్రసాద్ రుక్మిణి వసంత్ గురించి వెల్లడించారు. ఆమె ఒక వర్ధమాన హీరోయిన్. ఆమె జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం కాంతారా చాప్టర్ 1లో నటిస్తోందన్నారు. ఇందులో రిషబ్ షెట్టి నటిస్తుండడం విశేషం.
Also Read : Deputy CM Pawan Kalyan Interesting Update : ప్రతి నెలా రెండుసార్లు సమీక్ష చేస్తా
