Popular Producer Maan Singh – Ruchi Gujjar : నిర్మాత మాన్ సింగ్ పై న‌టి రుచి గుజ్జ‌ర్ దాడి

రూ. 25 లక్ష‌లు తీసుకుని మోసం చేశాడ‌ని ఫైర్

Hello Telugu - Popular Producer Maan Singh - Ruchi Gujjar

Hello Telugu - Popular Producer Maan Singh - Ruchi Gujjar

Ruchi Gujjar : ముంబై – ప్ర‌ముఖ న‌టి రుచి గుజ్జ‌ర్ సంచ‌ల‌నంగా మారారు. న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు మాన్ సింగ్ పై చెప్పుల‌తో దాడి చేశారు. అంద‌రూ చూస్తూ ఉండ‌గానే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న నుంచి రూ. 25 ల‌క్ష‌లు తీసుకున్నాడ‌ని, ఇవ్వమంటే ఇవ్వ‌కుండా ఇబ్బంది పెడుతున్నాడ‌ని వాపోయింది. త‌న‌ను మోసం చేశాడ‌ని ఆరోపించింది. ముంబైలోని సినీ పోలిస్ థియేటర్‌లో నటి రుచి గుజ్జర్ (Ruchi Gujjar) సో లాంగ్ వ్యాలీ ప్రదర్శన సందర్భంగా నిర్మాత-నటుడు మాన్ సింగ్‌ను చెప్పుతో కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో ముంబై చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం రేపింది.

Ruchi Gujjar Fired on Producer Maan Singh Chouhan

దీంతో రుచి గుజ్జ‌ర్ ఆరోప‌ణ‌ల‌తో పోలీసులు నిర్మాత‌, న‌టుడు, ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ సింగ్ చౌహాన్ పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. త‌న నిర‌స‌నను ఈ విధంగా తెలియ చేసేందుకే థియేట‌ర్ లోకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. రుచి గుజ్జ‌ర్ నిర‌స‌న‌కారుల‌తో క‌లిసి వ‌చ్చింది. ఆమె చుట్టూ ఉన్న వారంతా స‌ద‌రు , మోసం చేసిన నిర్మాత చౌహాన్ కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారంతా నిర్మాతల ఫోటోలు ఉన్న ప్లకార్డులను పట్టుకుని ఉన్నారు. కొన్ని పోస్టర్లలో నిర్మాతలు గాడిదలపై కూర్చున్నట్లు ఉన్నాయి.

అస‌లు దాడి చేయ‌డానికి గ‌ల కార‌ణం ఏమిటంటే నిర్మాత క‌ర‌ణ్ సింగ్ చౌహాన్ గత సంవత్సరం సోనీ టీవీలో త్వరలో ప్రసారం కానున్న హిందీ టెలివిజన్ సీరియల్‌ను నిర్మిస్తున్నానని చెబుతూ ఆమెను సంప్రదించాడు. త‌న‌ను స‌హ నిర్మాత‌గా చేర్చుకుంటాన‌ని ఆఫర్ చేశాడు. ప్రాజెక్టుకు సంబంధించిన ప‌త్రాల‌ను కూడా పంపించాడు. ఈ ఆఫర్‌ను నమ్మిన రుచి గుజ్జ‌ర్ జూలై 2023, జనవరి 2024 మధ్య, తన కంపెనీ SR ఈవెంట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి అనేక చెల్లింపులను చౌహాన్ K స్టూడియోస్‌కు సంబంధించిన ఖాతాలకు బదిలీ చేశానని పేర్కొంది. ఇందుకు సంబంధించి డ‌బ్బులు ఇవ్వాల‌ని కోరినా స్పందించ‌క పోవ‌డంతో దాడి చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది రుచి గుజ్జ‌ర్.

Also Read : AP DGP Exclusive – Maoist Couple : సీనియ‌ర్ మావోయిస్టు దంప‌తులు స‌రెండ‌ర్

Exit mobile version