AP DGP Exclusive – Maoist Couple : సీనియ‌ర్ మావోయిస్టు దంప‌తులు స‌రెండ‌ర్

వెల్ల‌డించిన ఏపీ డీజీపీ హ‌రీశ్ కుమార్ గుప్తా

Hello Telugu - AP DGP Exclusive - Maoist Couple

Hello Telugu - AP DGP Exclusive - Maoist Couple

AP DGP  : అమ‌రావ‌తి – ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇద్దరు సీనియర్ మావోయిస్టు దంపతులు సరెండర్ (Maoist Couple) అయ్యారని ప్ర‌క‌టించారు. శ‌నివారం డీజీపీ (AP DGP) మీడియాతో మాట్లాడారు. మావోయిస్ట్ పార్టీలో సుమారు 34 సంవత్సరాలు పైగా పని చేసిన సీనియర్ మావోయిస్టు జోరిగె నాగరాజు అలియాస్ కమలేశ్ తో పాటు ఆయ‌న భార్య మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణ లొంగి పోయార‌న్నారు. కమలేశ్ ప్రస్తుతం తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్చార్జ్ పనిచేస్తూ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో SZCM హోదాలో ఉన్నారని చెప్పారు.

AP DGP Harish Kumar Gupta Announced

మావోయిస్టు పార్టీ వైఫల్యాలు, కేంద్ర కమిటీ విధానాలపై విసుగు చెంది, ఈ సిద్ధాంతం ఇక చలామణిలో అవ్వదని గ్రహించి లొంగి పోయినట్లు వెల్ల‌డించారు డీజీపీ హ‌రీశ్ కుమార్ గుప్తా (AP DGP). చత్తీస్‌గఢ్ లో వీరు మావోయిస్టు లుగా కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కమలేష్ పై ఆంధ్రా ప్రదేశ్ లో 20 లక్షల రూపాయల రివార్డు, అరుణ పై 5 లక్షల రూపాయల రివార్డు ఉంద‌న్నారు. లొంగిపోయిన దంపతులకు తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున చెక్కులను అందచేశామ‌న్నారు డీజీపీ . అల్లురి సీతారామరాజు జిల్లాలో ఆపరేషన్ బృందాలు ఆయుధాలు డంప్ స్వాధీనం చేసుకుందన్నారు.

వీటిలో మొత్తం 18 ఆయుధాలు ఉన్నాయన్నారు. 1 AK-47, 2 BGLలు, 5 SLRలు, 2 INSAS రైఫిళ్లు, 606 లైవ్ రౌండ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు, ఇతర పరికరాలు దొరికినట్లు చెప్పారు. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచార ఆధారంగా స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. ఇటీవల కాలంలో ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందన్నారు. పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్ లు చేస్తున్నారని చెప్పారు డీజీపీ.

Also Read : Goa Governor – Ashok Gajapathi Raju Proven : గోవా గ‌వ‌ర్న‌ర్ గా కొలువు తీరిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు

Exit mobile version