RS Praveen Kumar Fired on Congress Govt : వీళ్లు మంత్రులా వ‌సూలు రాయుళ్లా : ఆర్ఎస్పీ

రాష్ట్రంలో గాడి త‌ప్పిన పాల‌న‌పై ఆగ్ర‌హం

Hello Telugu - RS Praveen Kumar Fired on Congress Govt

Hello Telugu - RS Praveen Kumar Fired on Congress Govt

RS Praveen Kumar : హైద‌రాబాద్ : కోరి తెచ్చుకున్న తెలంగాణ‌ను ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar). ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం కొట్టుకునే మంత్రులు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారని ప్ర‌శ్నించారు. మొన్న‌టికి మొన్న మంత్రులు అడ్లూరి ల‌క్ష్మ‌ణ్, ప్ర‌భాక‌ర్, వివేక్ వెంక‌ట స్వామి కొట్లాడుకున్నార‌ని, ఇవాళ బ‌హిరంగంగానే డెక్క‌న్ సిమెంట్ కంపెనీ నుంచి డ‌బ్బులు వ‌సూలు విష‌యంలో పంప‌కాలలో తేడాలు రావ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చారంటూ మండిప‌డ్డారు. ఇదేనా బంగారు తెలంగాణ అని మండిప‌డ్డారు ఆర్ఎస్పీ. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, కొండా సురేఖ‌, రోహిన్ రెడ్డి, వేం న‌రేందర్ రెడ్డిలు ఒక‌రిపై మ‌రొక‌రు ఆధిపత్యం కోసం రాజ‌కీయాలు చేస్తున్నార‌ని, ఇక ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి ఏం ఆలోచిస్తారంటూ నిల‌దీశారు.

RS Praveen Kumar Slams Congress Govt

ఇదంతా రాజ్యం నాది అని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడ‌ని సీరియ‌స్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఆఫీసియల్‌గా సెక్రటేరియట్‌లో జరగాల్సినవి రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్ లో ఎందుకు జ‌రుగుతున్నాయో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత నిజాలు చెప్పింద‌న్నారు. అసలు కాల్ డీటెయిల్స్ తీయాల్సినవి రేవంత్ రెడ్డివి, రోహిన్ రెడ్డివి, పొంగులేటివి, ఉత్తమ్ కుమార్ రెడ్డివి అని డిమాండ్ చేశారు. వీళ్ళ అందరి కాల్ డీటెయిల్స్ ఇస్తే ఈ దొంగల ముఠా గూడు పుఠాని బైట పడుతుందన్నారు. అస‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సుమంత్ ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు అరెస్ట్ చేయ‌డం లేద‌ని నిల‌దీశారు స‌ర్కార్ ను.

Also Read : Konda Sushmita Fired on CM Revanth : సీఎం త‌మ్ముళ్లు క‌బ్జా రాయుళ్లు : కొండా సుస్మిత‌

Exit mobile version