Konda Sushmita Fired on CM Revanth : సీఎం త‌మ్ముళ్లు క‌బ్జా రాయుళ్లు : కొండా సుస్మిత‌

మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మంత్రి కూతురు

Hello Telugu - Konda Sushmita Fired on CM Revanth

Hello Telugu - Konda Sushmita Fired on CM Revanth

Konda Sushmita : హైద‌రాబాద్ : రాష్ట్ర ప్ర‌భుత్వంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయ‌న త‌మ్ముళ్ల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మ‌రోసారి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా ప‌టేల్ (Konda Sushmita). గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. హుటాహుటిన రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ తో భేటీ అయ్యేందుకు వెళ్లారు. మ‌రో వైపు ఈ వ్య‌వ‌హారంతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు మంత్రి భ‌ర్త కొండా ముర‌ళి. ఇదిలా ఉండ‌గా సీఎం త‌మ్ముళ్లు అయినంత మాత్రాన గ‌న్ మెన్లు ఎందుకు ఇస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. తెలంగాణలో మొత్తం భూములు కబ్జా చేస్తున్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కొండా సుష్మితా పేల్. మంచిరేవులలో విలాస్ కట్టుకున్న కొందరు వ్యక్తులు దారి కోసం ఎండోమెంట్ భూమిని అడిగారని అన్నారు. అది ఇస్తే పక్కన ప్రైవేట్ ల్యాండ్ ఇస్తామని చెప్పార‌ని తెలిపారు.

Konda Sushmita Slams CM Revanth Reddy

ఈ ఫైల్ మీద త‌న త‌ల్లి కొండా సురేఖ సంతకం చేస్తే, జపాన్‌లో ఉన్న రేవంత్ రెడ్డి ఆ ఫైల్‌ను ఆపించాడని ఆరోపించారు సుష్మిత‌. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్లు ఆ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని మండిప‌డ్డారు. అందుకే మా అమ్మ సంతకం పెట్టిన ఫైల్‌ను సీఎం కావాల‌ని ఆపించాడ‌ని ఆరోపించారు. ఢిల్లీలో, ఇక్క‌డ కూడా జ‌రిగిన స‌మావేశాల‌లో రేవంత్ రెడ్డి త‌న త‌ల్లిని అవ‌మానించేలా మాట్లాడాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న పేరెంట్స్ కు ఏమైనా జ‌రిగితే ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ద‌మై ఉన్నామ‌న్నారు. గ‌త 40 ఏళ్లుగా రాజ‌కీయాల‌లో ఉన్నామ‌న్నారు కొండా సుష్మిత‌.

Also Read : KTR Shocking – Vote Theft : ఓటు చోరీపై హైకోర్టులో బీఆర్ఎస్ పిటీషన్

Exit mobile version