న్యూఢిల్లీ : కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పని తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది దేశ వ్యాప్తంగా. ఉన్నట్టుండి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విమానయాన శాఖపై పట్టు లేక పోవడం, ఆయా ఎయిర్ పోర్టులలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఇండిగో ఎయిర్ లైన్స్ ఉన్నట్టుండి 1000 విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో వేలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో కేంద్ర సర్కార్ చర్యలకు దిగింది. ఇదే సమయంలో ఇండిగో సంక్షోభం చోటు చేసుకుంది. ప్రధానంగా నేషనల్ మీడియా కేంద్ర మంత్రి నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధానంగా చర్చ వేదికలలో టీడీపీ నేతలను, సర్కార్ ను ఏకి పారేసింది. ఇంత జరుగుతున్నా ఎందుకని తాత్సారం చేశారంటూ నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రిపబ్లిక్ టీవీ ఛానల్ సిఈఓ అర్నాబ్ గోస్వామి.మంత్రి నారా లోకేష్ రివ్యూ చేస్తున్నారు అంటూ టీడీపీ ప్రతినిధి చర్చలో అర్నాబ్ గోస్వామి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.. దీంతో గోస్వామి ఆయనెవరు రివ్యూ చేయడానికి అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కదా చేయాల్సింది.అని కౌంటర్ ఇచ్చాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.. వైసీపీ సోషల్ మీడియా కూడా టీడీపీ ని ఒక ఆట ఆడేసుకుంది. దీంతో పరువు పోయిందని.. అర్నాబ్ చర్చకు పిలిచి అవమానించడంటూ కామెంట్స్ చేశారు పసుపు పచ్చ నేతలు. లోకేష్ పై అర్నాబ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయని, ఇక ముందు రిపబ్లిక్ టీవీ చర్చలకు టీడీపీ వాళ్ళు ఎవరు వెళ్లకూడదని మొత్తంగా బహిష్కరించాలని నిర్ణయించారు…
దీనిపై స్పందించిన అర్నాబ్ మరోసారి టీడీపీపై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.. బహిష్కరించడం వల్ల మీకే నష్టమని.. ముందు మీ కేంద్రమంత్రి మంచిగా పని చేసేలా చూసుకోవాలని ఎద్దేవా చేశాడు.

















