Rohit Sharma Interesting Comments on Nitish : అన్ని ఫార్మాట్ ల‌కు నితీష్ రెడ్డి స‌రిపోతాడు

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన స్టార్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ‌

Hello Telugu - Rohit Sharma Interesting Comments on Nitish

Hello Telugu - Rohit Sharma Interesting Comments on Nitish

Rohit Sharma : ముంబై : స్టార్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను తెలుగు క్రికెట‌ర్ నితీశ్ రెడ్డి గురించి ప్ర‌శంసించాడు. త‌ను భార‌త జ‌ట్టుకు సంబంధించిన అన్ని ఫార్మాట్ ల‌కు స‌రి పోతాడ‌ని పేర్కొన్నాడు. త‌ను ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న సీరీస్ ల‌కు ఎంపిక‌య్యాడు. మ‌రో వైపు వ‌న్డే ఫార్మాట్ లో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను త‌ప్పించ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ కైఫ్‌. ఇదిలా ఉండ‌గా నితీశ్ రెడ్డి గ‌త సంవత్సరం ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. తర్వాత టెస్ట్ జట్టులోకి దూసుకెళ్లాడు.

Rohit Sharma Proposed to Nitish Reddy

అక్టోబర్ 19న పెర్త్‌లో ఆస్ట్రేలియా, భారతదేశం మధ్య జరిగిన మొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా త‌ర‌పున ఆడాడు. త‌న వ‌య‌సు 22 ఏళ్లు మాత్ర‌మే. రాబోయే రోజుల్లో వ‌న్డే, టి20, టెస్టు ఫార్మాట్ ల‌కు స‌రిగ్గా స‌రి పోతాడ‌ని పేర్కొన్నాడు. ఆల్ ఫార్మాట్ గ్రేట్ గా మార‌డం ఖాయ‌మ‌న్నాడు. ఇదిలా ఉండ‌గా భారత బ్యాటింగ్ మాస్ట్రో విరాట్ కోహ్లీ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో నితీష్‌కు తన తొలి టెస్ట్ క్యాప్‌ను అందజేశాడు. త‌న‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌న్నాడు. భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ త‌న ఐపీఎల్ టీంలో కూడా క‌లిసి ఆడాడు. త‌ను ఆడే తీరు అన్నింటికి స‌రి పోతుంద‌న్నాడు.

Also Read : PM Modi Shocking Comments : ఆప‌రేష‌న్ సిందూర్ తో స‌త్తా చాటాం : మోదీ

Exit mobile version