Conistable Murder : నిజామాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన. నిన్న నిజామాబాద్ లో కానిస్టేబుల్ (Conistable Murder) పై దాడి చేసిన ఘటనలో తను ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో మరో వ్యక్తిని చంప బోయాడని, అందుకే ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని తెలిపారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఈ విషయాన్ని ధ్రువీకరించారు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. మరో ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్ కౌంటర్ కు గురైన రియాజ్ వయసు 24 ఏళ్లు.
Conistable Murder in Telangana Sensational
తప్పించు కోవడానికి ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారని చెప్పారు. ప్రాథమిక సమాచారాన్ని ఉటంకిస్తూ షేక్ రియాజ్ పోలీసుల నుండి పిస్టల్ లాక్కొని పారిపోయే ప్రయత్నంలో వారిపై కాల్పులు జరిపాడని తెలిపారు. పోలీసులు ఎదురుదాడి చేయడంతో అతను మరణించాడని ప్రకటించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది, నిందితుడిని చికిత్స కోసం తరలించారు. వాహన దొంగతనం కేసులో గతంలో పట్టుబడ్డాడు షేక్ రియాజ్. పారి పోతుండగా పట్టుకోబోయిన కానిస్టేబుల్ ప్రమోద్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో మరణించాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.
Also Read : Home Minister Anitha Huge Support : బాధిత కుటుంబాలకు హోం మంత్రి భరోసా


















