హైదరాబాద్ : దమ్మున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం డ్రాగన్. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్, ప్రభాస్ తో సినిమాలు తీసి రికార్డులు సృష్టించిన నీల్ ఇప్పుడు మరో బిగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేశాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ , ఫోటోలు, వీడియోలు కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఒక్కసారి కమిట్ అయితే చాలు ఏ పాత్రకైనా ఇట్టే ఒదిగి పోతాడు. ఇక్కడ కూడా డ్రాగన్ లో తన సత్తా ఏమిటో చూపించాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లో తన పాత్రతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇక కొరటాల శిశ దర్వకత్వం వహించిన మూవీ బిగ్ సక్సెస్ గా నిలిచింది. ఆ తర్వాత వస్తున్న మూవీ డ్రాగన్.
ఇక | చిత్ర నిర్మాతలు ఇటీవల ఈ సినిమా ‘స్నీక్ పీక్’ (ముందస్తు ఝలక్)ను విడుదల చేశారు, దీనికి అన్ని వర్గాల నుండి అద్భుతమైన సానుకూల స్పందన లభించింది. ఇక ఇంటర్నెట్‌లో విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో ఆయన పేరు మార్మోగిపోతోంది . చిత్ర నిర్మాతలు ఇటీవల విడుదల చేసిన ఈ స్నీక్ పీక్‌కు అన్ని వర్గాల నుండి విశేషమైన ఆదరణ లభించింది. నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్ల నిడివి గల ఈ వీడియో, భారతీయ చరిత్ర లోతుల్లోకి ప్రయాణిస్తూ, స్వాతంత్రానికి పూర్వం, తర్వాతి కాలంలో భారతదేశంలో ఉన్న నల్లమందు వ్యాపారం పై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇక డ్రాగన్ మూవీ కోసం భారీ ధరకు ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లు టాక్.
