హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ

10 మంది స‌భ్యుల‌ను కొత్త‌గా నియ‌మించిన ప్ర‌భుత్వం

hellotelugu-HGCL

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంస్థ‌లో కీల‌క మార్పులు చేసింది. ఈ మేర‌కు 10 మంది కొత్త స‌భ్యుల‌ను ఎంపిక చేసింది. హెచ్ జీ సీఎల్ బోర్డును పునర్వ్యవస్థీకరించింది ప్రభుత్వం – ఇందులో ‘కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ’ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు , ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ( హైడ్రా) కమిషనర్ ఏవీ రంగ‌నాథ్ ను కూడా స‌భ్యులుగా చేర్చింది. మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అంతే కాకుండా హెచ్ ఎం డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ వైస్ చైర్మన్‌గా, హెచ్ జీ సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అదే హోదాలో కొనసాగుతారు.

హెచ్ జీ సీఎల్ చేపడుతున్న పనుల విస్తృతి , ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలు , వాటాదారులను చేర్చడం ద్వారా ఈ బోర్డును బలోపేతం చేసి పునర్వ్యవస్థీకరించినట్లు ప్ర‌భుత్వం తెలిపింది. ప్రాజెక్టుల సమర్థవంతమైన సమన్వయం, సమగ్ర అమలు , సంపూర్ణ ప్రణాళికను నిర్ధారించడం, అలాగే భూసేకరణ , మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సకాలంలో పూర్తికి వీలు కల్పించడం ఈ పునర్వ్యవస్థీకరణ లక్ష్యం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు , హెచ్ ఎం డ‌బ్ల్యూ ఎస్ , ఎస్ బీ , HMWS&SB, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్లు; అలాగే హైడ్రా కమిషనర్ నామినీ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారని తెలిపింది ప్ర‌భుత్వం.

Exit mobile version