ఓటు హ‌క్కు తొల‌గించ‌డం రాజ్యాంగ విరుద్దం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ‌స్టిస్ భూయాన్

hellotelugu-Justicebhuyan

హైద‌రాబాద్ : సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ భూయాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో పౌరుల‌కు సంబంధించి వారి అనుమ‌తి తీసుకోకుండా ఓటు హ‌క్కు తొల‌గించ‌డం భార‌త రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ద‌మ‌న్నారు. ఓటర్ల సామూహిక తొలగింపుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. .ఏదైనా ప్రక్రియ లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును హరించడానికి దారితీస్తే… అటువంటి ప్రక్రియ స్వభావరీత్యా ఏకపక్షమైనది అని అన్నారు. ఇది రాజ్యాంగ మూలాలపైనే దాడి చేస్తుంది అని అన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు . భారీ సంఖ్యలో భారత పౌరుల ఓటు హక్కులను హరించే ఏ ప్రక్రియ అయినా రాజ్యాంగ వ్యవస్థను ఉల్లంఘించడమే అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభివర్ణించారు. ఏ అధికార సంస్థ కూడా అలా చేయకూడదని, ఏ న్యాయస్థానం కూడా దానిని సహించకూడదు అని ఆయన స్పష్టం చేశారు.

భారత రాజ్యాంగం ఓటు హక్కు ఉన్న పౌరులు, ఓటు హక్కు లేని పౌరులు అని రెండు వర్గాల పౌరులను ఏర్పాటు చేయలేదన్నారు. ఏదైనా ప్రక్రియ లక్షలాది మంది భారత పౌరుల ఓటు హక్కును హరించి, వారిని సొంత దేశంలోనే ఓటు హక్కు లేని పౌరులుగా, రెండవ తరగతి పౌరులుగా మార్చినట్లయితే, అటువంటి ప్రక్రియ స్వభావరీత్యా ఏకపక్షమైనది. ఎంత వాదించినా దానిని సమర్థించ లేమ‌న్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ మూలాలనే దెబ్బ తీస్తుందని హెచ్చ‌రించారు. సమానత్వ హక్కుకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను, సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించే ఆర్టికల్ 326ను అటువంటి చర్య ఉల్లంఘిస్తుందని ఆయన అభివర్ణించారు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం మనం స్వీకరించిన రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకమని నేను చెప్పగలను అని జోడించారు.

Exit mobile version