ఓటు హ‌క్కును తొల‌గించ‌డం చ‌ట్ట‌రీత్యా నేరం

నిప్పులు చెరిగిన మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య

helloteelugu-Siddaramaih

బెంగ‌ళూరు : కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్వాకంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య . ఓట్ బ‌చావో దేశ్ బ‌చావ్ పేరుతో ఇండియా కూట‌మి ఆధ్వ‌ర్యంలో బెంగ‌ళూరు న‌గ‌రంలో భారీ ర్యాలీ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం డీకే శివ‌కుమార్ తో పాటు సిద్ద‌రామ‌య్య పాల్గొని ప్ర‌సంగించారు. భార‌త దేశంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప‌నిగ‌ట్టుకుని మోదీ , అమిత్ షా ద్వ‌యం తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తిని ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా నియ‌మించార‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. దేశ ప్రజల ఓటు హక్కును కాలరాసిన స‌ర్ ప్రక్రియ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన ఒక తీవ్రమైన నేరం అని అన్నారు సిద్ద‌రామ‌య్య‌. ఈ స‌ర్ కు వ్యతిరేకంగా నేడు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారని చెప్పారు.

ఈ అక్రమానికి బాధ్యులైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సిద్ద‌రామ‌య్య డిమాండ్ చేశారు. ఏ మాత్రం సిగ్గు శ‌రం ఉన్నా త‌క్ష‌ణ‌మే దిగి పోవాల‌న్నారు. త‌మ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే త‌న‌ను జైలుకు పంపిస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనుసన్నల్లో నడుస్తున్న జ్ఞానేష్ కుమార్ మన దేశ ప్రజాస్వామ్యానికే ఒక మచ్చగా మారారంటూ మండిప‌డ్డారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసిన ఈ మచ్చను తుడిచిపె ట్టాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ యుద్దం చేస్తోంద‌న్నారు. ఈ కార్యక్రమంలో కెపిసిసి అధ్యక్షుడు బి.కె. హరిప్రసాద్, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, అలాగే ప్రస్తుత ,మాజీ మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు , ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version