ముంబై : భారత జట్టు మాజీ హెడ్ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ తాజాగా టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును ప్రకటించింది. ఇందులో 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గత కొంత కాలంగా దేశివాళి టోర్నీలో అద్భుతంగా రాణించినా కావాలని పక్కన పెట్టారు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను . దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఓ వైపు శుభ్ మన్ గిల్ 31 మ్యాచ్ లు ఆడి కేవలం 291 పరుగులు చేసినా ఎందుకని కంటిన్యూ చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో గత్యంతరం లేక హెడ్ కోచ్ గౌతం గంభీర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ లు ముంబై లోని బీసీసీఐ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు.
స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగే టి20 సీరీస్ కు , ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే ఐసీసీ టి20 వరల్డ్ కప్ కు ఒకే జట్టును ఎంపిక చేశారు. జట్టుకు భారంగా మారిన శుభ్ మన్ గిల్ తో పాటు జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలను పక్కన పెట్టేశారు. ఆపై స్టార్ క్రికెటర్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ లను తిరిగి తీసుకున్నారు. ఈ సందర్బంగా టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపికపై స్పందించాడు రవిశాస్త్రి. సంజూ శాంసన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమమైన, సహజ సిద్దమైన ఆటగాడు అంటూ కితాబు ఇచ్చారు. ఎట్టకేలకు శాంసన్ ను ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తన రాకతో భారట జట్టు అద్భుతమైన ఓపెనింగ్ జోడీ మరింత బలోపేతం అవుతుందన్నాడు. రాబోయే టోర్నీలో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించడం ఖాయమన్నాడు రవిశాస్త్రి.
