హైదరాబాద్ : నేషనల్ క్రష్ రష్మిక మందన్న సంచలనంగా మారారు. సోషల్ మీడియా వేదికగా శనివారం తను ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా చాలా కాలం తర్వాత తన భర్త, ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండతో కలిసి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రణబాలి చిత్రంలో. ఈ ఇద్దరి కెమిస్ట్రీ మరోసారి తెరపై మనసు దోచుకునేలా చేసింది. ఆనాటి బ్రిటీష్ కాలంలో చోటు చేసుకున్న కరువు పరిస్థితుల్లో వేలాది మంది ఆకలితో చని పోయారు. ఈ చిత్రాన్ని పూర్తిగా పీరియాడిక్ నేపథ్యంతో తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మూవీపై అంచనాలు మరింత పెంచేలా చేశారు.
ఓ వైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు పెళ్లి చేసుకున్న తర్వాత నటించిన చిత్రం ఇదే కావడంతో అందరి దృష్టి దానిపై పడింది. అయితే స్టార్టింగ్ లో మిశ్రమ స్పందన లభించింది రణబాలిపై. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన్న జయమ్మ పాత్రలో నటించింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణం పోసింది. ఇక విజయ్ దేవరకొండ సైతం పోటీ పడి నటించాడు. ఈ ఇద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. మరో వైపు 15న సూపర్ స్టార్ రజనీకాంత్ కీ రోల్ పోషించిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ -2 విడుదలైంది. దీంతో ఈ మూవీకి రణబాలికి మధ్య వార్ నడిచింది. అయితే తలైవా మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. మరో వైపు రణబాలి ఆశించిన మేర ఆకట్టుకునేలా లేదని టాక్ వినిపిస్తోంది. ఈ సందర్బంగా రష్మిక మందన్నా తన పాత్ర జయమ్మ గురించి స్పందించారు. తన జీవితంలో మరిచి పోలేని మూవీ రణబాలి అని అన్నారు.

















