హైదరాబాద్ : పాన్ ఇండియా డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి తాజాగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన రణబాలి పై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్బంగా సినిమా సూపర్ గా ఉందని, వీరి నటనకు వంద మార్కులు వేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం వంగా సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ తీస్తున్నాడు. ఇక రణబాలి మంచి మౌత్ టాక్తో విజయవంతంగా నడుస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల చిత్ర నిర్మాతలు ఫలితంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ దసరా సుదీర్ఘ సెలవుల కాలంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఇప్పటికీ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో వంగా సందీప్ రెడ్డి కూడా సినిమా చూశానని, అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చాడు. శనివారం సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రణబాలి తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నాడు.
ఇక వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మూవీ చేశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే సినిమాను హిందీలో చేశాడు. ఇక ఎక్స్ లో చేసిన పోస్టులో విజయ్ దేవరకొండ యాక్షన్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు. యాక్షన్లో సహజమైన, అదుపులేని ఉగ్రత ఉంది, దాన్ని కృత్రిమంగా సృష్టించలేం. మీరు పోరాడే విధానంలో భయంకరమైన తీవ్రత ఉంది. మీరు భారతీయ సినిమాకు తదుపరి నిర్వచనాత్మక యాక్షన్ హీరో అవుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని హీరోను అభినందించారు. అద్భుతమైన పాత్ర చిత్రణ కోసం ‘రణబలి’ సినిమా చూడండి. రష్మిక మందన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. తను నటిగా మరోసారి నిరూపించుకుంది. రష్మిక పోషించిన జయమ్మ పాత్ర ఎంతో వాస్తవికంగా, హృదయాన్ని హత్తుకునేలా అనిపించిందని కితాబు ఇచ్చాడు వంగా సందీప్ రెడ్డి. మొత్తంగా మరుగున పడిన చరిత్రకు దర్పణం రణబలి సినిమా అని పేర్కొన్నాడు.

















