హైదరాబాద్ : టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా మారి పోయింది అందాల ముద్దుగుమ్మ డింపుల్ హయతి. తను స్వతహాగా నటి మాత్రమే కాదు ఆ మధ్యన తిరుమలలో కళా వేదికపై అద్బుతమైన నాట్యంతో ఆకట్టుకుంది కూడా. డ్యాన్స్ చేయడంలో తనకు తనే సాటి. హీరోలకు ధీటుగా తనను తాను ప్రూవ్ కూడా చేసుకుంది. ఆ మధ్యన మాస్ మహరాజా రవితేజతో కలిసి స్టెప్పులు వేసింది. తన హావభావాలు, అందచందాలతో కుర్రకారుకు మత్తు ఎక్కించేలా చేస్తోంది ఈ అమ్మడు. తాజాగా ఎర్రని రంగులో చీరను కట్టడంతో అందరి కళ్లు తనపై పడ్డాయి. ముందే అందాల తార. ఆపై అందమైన శారీ కడితే ఇంక ఏమైనా ఉందా. ఫ్యాన్స్ రెచ్చిపోక తప్పదు. ప్రస్తుతం తను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం చిత్రంలో నటిస్తోంది డింపుల్ హయతి.
తాజాగా సాంప్రదాయ ఎర్రని చీరలో మెరిసి పోతూ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘గద్దలకొండ గణేష్’, ‘ఖిలాడి’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఈ నటి ప్రస్తుతం మరికొన్ని తెలుగు ప్రాజెక్టులలో నటిస్తోంది. బంగారు జరీ అంచు, పూల డిజైన్లు కలిగిన అందమైన ఎర్రని చీరలో డింపుల్ అద్భుతంగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా బంగారు వర్ణపు డిజైన్లు ఉన్న షార్ట్ స్లీవ్ బ్లౌజ్ను ఆమె ధరించింది. బంగారు టెంపుల్ నెక్లెస్, జుంకాలు, చేతులకు గాజులు, ఉంగరం , నుదుటన చిన్న ఎర్రటి బొట్టుతో ఆమె తన రూపాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకుంది. తన కురులను వదులుగా ఉంచి, బంగారు రంగు తెరల నేపథ్యంలో చిరునవ్వుతో ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. తన రాబోయే చిత్రాల విషయానికి వస్తే, డింపుల్ ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం’ ‘భోగి’ చిత్రాల్లో నటిస్తోంది.


















