Rapper Vedan Shocking : రేప్ కేసులో రాప‌ర్ వేద‌న్ కు భారీ ఊర‌ట

ముంద‌స్తు బెయిల్ మంజూరు చ‌సిన కోర్టు

Hello Telugu - Rapper Vedan Shocking

Hello Telugu - Rapper Vedan Shocking

Rapper Vedan : కేర‌ళ – రాపర్ వేదన్‌కు భారీ ఊర‌ట ల‌భించింది. అత్యాచారం కేసులో కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత వైదొలిగాడని బాధిత మ‌హిళ ఆరోపించింది. ఈ మేర‌కు కోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. రాపర్‌కు జస్టిస్ బెచు కురియన్ థామస్ ఉపశమనం క‌లిగించేలా తీర్పు చెప్పారు. దీంతో రాప‌ర్ వేద‌న్ ఉప‌శ‌మ‌నం పొందారు.

Rapper Vedan Rape Case

రాప‌ర్ వేద‌న్ (Rapper Vedan) పై ఉన్న‌ ఆరోపణలు తీవ్రమైనవి అయినప్పటికీ, అతని కస్టడీ విచారణ అవసరం లేదని పేర్కొంది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని మోసం చేశాడంటూ బాధితురాలు వాపోయింది. 2021, 2023 మధ్య ఆయన తనను అనేకసార్లు లైంగికంగా వేధించారని కూడా ఆమె ఆరోపించింది. రాపర్, మహిళ మధ్య పరిచయం 2021 సంవత్సరంలో ప్రారంభ‌మైంది. మార్చి 2023 వరకు కొనసాగిందని ప్రాథమికంగా గుర్తించదగిన‌ద‌ని హైకోర్టు పేర్కొంది.. ఆ తర్వాత వారు విడిపోయారు. వారు కలిసి ఉండి శారీరక సంబంధాలు కలిగి ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి…. అటువంటి పరిస్థితులలో, పిటిషనర్ (వేదన్) కు ముందస్తు బెయిల్ నిరాకరించడం తీవ్రమైన పక్షపాతానికి దారితీస్తుంది అని పేర్కొంది.

Also Read : Minister Anam Interesting Comments : 5,250 ఆల‌యాల‌కు దూప దీప నైవేద్యం

Exit mobile version