Minister Anam : కాణిపాకం – రాష్ట్రంలో 5250 ఆలయలకు దూప దీప నైవేద్యం అమలు చేయడం జరుగుతుంది అని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam) పేర్కొన్నారు . వర సిద్ది వినాయక స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటు వంటి పూజా కైంకర్యాలు ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో పరివేక్షించడానికి ఏర్పాట్లు చేశామన్నారు.
Minister Anam Ramanarayana Reddy Key Comments
బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు (CM Chandrababu) లేకపోతే సహచర మంత్రివర్గాన్ని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం పంపడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈసారి సీఎంకు బదులు కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందన్నారు. గడిచిన సంవత్సరం వర్షాల ప్రభావంతో తాము రాలేక పోవడంతో స్థానిక శాసనసభ్యున్ని పట్టు వస్త్రాలు సమర్పించమని ప్రభుత్వం నుండి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు.
ఎటువంటి విజ్ఞాలు కలగకుండా సమ సమాజ స్థాపన జరగాలని ప్రార్థించామన్నారు. స్వామి కృపతో కాణిపాకంలో అన్నప్రసాద వితరణ భవనాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. దాదాపు 4 కోట్లు రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్నో ఆలయాలు పునర్ నిర్మాణం చేపట్టామన్నారు. అర్చకులకు గతంలో పదివేల రూపాయల పారితోషకం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక రూ. 15 వేలకు పెంచామన్నారు. ధూప దీప నైవేద్యాలకి గతంలో 5000 రూపాయలు ఉంటే ఈ ప్రభుత్వంలో 10,000 పెంచడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 5250 ఆలయలకు దూప దీప నైవేద్యం అమలు చేయడం జరుగుతుందన్నారు. బ్రాహ్మణుల ఆదాయాన్ని పెంచడం కోసం 25 వేల రూపాయలు ప్రతినెల వారికి పారితోషకం ఇస్తున్నామ్నారు. వేద విద్య అభ్యసించిన వేద విద్యార్థుల కు సంభావన కింద నెలకు 3000 రూపాయలు కేటాయించామన్నారు. దేవాదాయ శాఖలో 500 జాబ్స్ ఖాళీగా ఉన్నాయన్నారు.
Also Read : Vinayaka Chavithi – YS Jagan Interesting : గణేశుడికి పూజలు చేసిన మాజీ సీఎం జగన్
