Ram Gopal Varma : బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ఏకైక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తను ఓ ఫ్యాక్టరీ. ఎంతో మందిని సినిమాకు పరిచయం చేశాడు. ఒకప్పుడు అనామకులుగా ఉన్న వారంతా కొద్దికాలంలోనే టాప్ లోకి తీసుకు వచ్చారు. తాజాగా సంచలన ప్రకటన చేశారు ఆర్జీవీ. సుదీర్ఘ కాలం అంటే దాదాపు 27 ఏళ్ల తర్వాత తిరిగి కలవబోతున్నారు. మనోజ్ వాజ్ పేయితో తను కొత్తగా మూవీ తీస్తున్నట్లు ప్రకటించాడు. దానికి పేరు కూడా పెట్టాడు. దీనిని పూర్తిగా హార్రర్, కామెడీ ప్రధానంగా పోలీస్ స్టేషన్ మే భూత్ ను చిత్రీకరిస్తానని పేర్కొన్నాడు. చిత్ర నిర్మాత రామ్ గోపాల్ వర్మ , మనోజ్ బాజ్‌పేయి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సత్య, చిత్రం తర్వాత పోలీస్ స్టేషన్ మే భూత్ అనే రాబోయే హారర్ కామెడీ కోసం తిరిగి కలిశారు. ఇది సంచలనంగా మారింది.
Ram Gopal Varma Movie Updates
ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు . రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. సత్య తర్వాత మళ్ళీ మనోజ్ వాజ్ పేయితో కలిసి పని చేయడం ఉత్కంఠను తప్పకుండా కలిగిస్తుందన్నారు. భద్రత అనేది అత్యున్నత అధికారాన్ని సవాలు చేసినప్పుడు భయం అత్యంత భయానకంగా మారుతుందన్నాడు. పోలీస్ స్టేషన్ శక్తికి అంతిమ చిహ్నం అని పేర్కొన్నాడు ఆర్జీవీ. మనోజ్‌తో పాటు ఈ చిత్రంలో నటి జెనీలియా దేశ్‌ముఖ్ కూడా నటించనున్నారు. మనోజ్ తీవ్రత , జెనీలియా దుర్బలత్వంతో ఈ కథ అధికారం ముసుగులో మనం భయానకతను ఎలా గ్రహిస్తామో దాని సరిహద్దులను దాటుతుంది అని వర్మ జోడించారు.
Also Read : KTR Fired on Rahul Gandhi : రాహుల్ గాంధీపై భగ్గుమన్న కేటీఆర్
