KTR : హైదరాబాద్ – కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ (KTR) మీడియాతో మంగళవారం మాట్లాడారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిత, రాజకీయ ప్రేరేపిత కల్పిత కథను రాసి తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని ఆరోపించారు. పీసీ ఘోష్ వంటి గౌరవనీయ న్యాయమూర్తి ఈ నివేదిక ఇచ్చి ఉంటారని తనకు నమ్మకం కలగడం లేదన్నారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకే ఒక ఎజెండా ఉందని అదది కేవలం మాజీ సీఎం కేసీఆర్ ను, తమను ఇబ్బంది పెట్టడం తప్ప మరోటి కాదన్నారు.
KTR Slams Rahul Gandhi
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అయిన కాళేశ్వరం ప్రాజెక్టును, మేడిగడ్డ ఆనకట్టను కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి రక్షించడానికి పార్టీ చట్ట పరమైన ఎంపికలను అన్వేషిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నామని, న్యాయ సలహా తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు కేటీఆర్. ప్రభుత్వం చేసిన కుట్రను ప్రజలు గ్రహిస్తారని పేర్కొన్నారు. గత 55 సంవత్సరాలుగా తెలంగాణకు నీటి కొరత ఏర్పడిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రమే నీటి కష్టాలను దూరం చేశామన్నారు. ఇందుకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని చెప్పారు.
ఇదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ, మోదీ, షా చేతుల్లో ఉన్నాయని ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారని, కానీ అదే సంస్థకు విచారణ కోసం సీఎం అప్పగించడం దారుణమన్నారు.
Also Read : Harish Rao Shocking Petition : హైకోర్టులో హరీశ్ హౌస్ మోషన్ పిటిషన్
