Rajnath Singh Shocking Comments : సీమాంత‌ర ఉగ్ర‌వాదంపై భార‌త్ యుద్దం

ప్ర‌క‌టించిన ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్

Hello Telugu - Rajnath Singh Shocking Comments

Hello Telugu - Rajnath Singh Shocking Comments

Rajnath Singh : ఢిల్లీ – కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ శాంతిని త‌ప్ప యుద్దాన్ని కోరుకోద‌న్నారు. తాము ఉగ్ర‌వాదాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హించే ప్ర‌స‌క్తి లేద‌ని ప్ర‌పంచానికి చాటి చెప్పారు. త‌మ‌పై ఇంకొక‌రి పెత్త‌నాన్ని, మ‌ధ్య వ‌ర్తిత్వాన్ని ఒప్పుకోమంటూ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం రాజ్ నాథ్ మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండ‌గా చైనాలో ఎస్ సీఓ కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ కీల‌క మీటింగ్ కు రాజ్ నాథ్ హాజ‌ర‌వుతారు.

Rajnath Singh Shocking Comments on Terrorism

ఇప్ప‌టికే భార‌త్ ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యారైన పాకిస్తాన్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా త‌మ స‌త్తా ఏమిటో దాయాది దేశంతో పాటు ప్ర‌పంచానికి తెలిసింద‌న్నారు రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh). చిల్ల‌ర వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోబోమ‌ని, ఈసారి పాకిస్తాన్ కు త‌గిన రీతిలో బుద్ది చెప్పి తీరుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు కేంద్ర మంత్రి.

ఇందులో భాగంగా సీమాంత‌ర ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా కొత్త దౌత్య ప‌ర‌మైన ఒత్తిడి మేర‌కు చైనాలోని కింగ్ డావోలో జ‌రిగే రెండు రోజుల షాంఘై స‌హ‌కార సంస్థ స‌మావేశంలో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తామ‌ని చెప్పారు. ఉగ్ర‌వాదాన్ని అరిక‌ట్టే ప్ర‌య‌త్నాల‌ను మ‌రింత ముమ్మ‌రం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు రాజ్ నాథ్ సింగ్.

చైనా టూర్ లో భాగంగా తూర్పు షాన్ డాంగ్ ప్రావిన్స్ లోని ఓడ రేవు న‌గ‌రాన్ని సంద‌ర్శిస్తారు కేంద్ర మంత్రి. ఇది అభివృద్ది చెందుతున్న ప్రాంతీయ భ‌ద్ర‌తా నిర్మాణంపై ఫోక‌స్ పెట్టేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.

Also Read : CM Siddaramaiah – BJP Shocking Demands :సీఎం సిద్ద‌రామ‌య్య రాజీనామా చేయాల్సిందే

Exit mobile version