Rajnath Singh Shocking Update : బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ ను లేకుండా చేస్తాయి

ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Rajnath Singh Shocking Update

Hello Telugu - Rajnath Singh Shocking Update

Rajnath Singh : ఢిల్లీ : కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బ్ర‌హ్మోస్ క్షిప‌ణులు పాకిస్తాన్ దేశాన్ని నామ రూపాలు లేకుండా చేస్తాయ‌ని అన్నారు. ఇంకోసారి దాయాది దేశం క‌నుక తోక జాడిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. ఆప‌రేష‌న్ సిందూర్ అనేది కేవ‌లం శాంపిల్ మాత్ర‌మేన‌ని అన్నారు. ఇంకోసారి గ‌నుక త‌మ జోలికి వ‌స్తే, ఆలోచ‌న చేస్తే పుట్ట‌గ‌తులు లేకుండా చేస్తామ‌న్నారు. ఇప్ప‌టికే ఆఫ్గ‌నిస్తాన్ కాళ్ల బేరానికి ఆఫ్గ‌నిస్తాన్ వ‌చ్చింద‌న్నారు. అయినా పాకిస్తాన్ త‌న తీరు మార్చు కోవ‌డం లేద‌న్నారు. శ‌నివారం బ్రహ్మోస్ ఏరోస్పేస్ కు సంబంధించి ల‌క్నోలో మొదటి బ్యాచ్ క్షిపణులను జెండా ఊపి ప్రారంభించారు రాజ్ నాథ్ సింగ్. ఇది భారతదేశ రక్షణ స్వావలంబనను మ‌రింత పెంచేలా చేస్తుంద‌న్నారు.

Defence Minister Rajnath Singh Key Update

పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో ఉందని ప్ర‌క‌టించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏమి జరిగిందో అది కేవలం ట్రైలర్ మాత్రమేనని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
బ్రహ్మోస్ భారత సాయుధ దళాలకు కీలక స్తంభంగా మారిందన్నారు. అది తన కలలను నిజం చేయగలదనే దేశం నమ్మకాన్ని బలోపేతం చేసిందని స్ప‌ష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ లక్నోలోని సరోజిని నగర్‌లోని కొత్త ఇంటిగ్రేషన్, టెస్ట్ ఫెసిలిటీ నుండి క్షిపణి వ్యవస్థ మొదటి బ్యాచ్‌ను విజయవంతంగా ఉత్పత్తి చేసిందని వెల్ల‌డించారు.

Also Read : Stock Market Growth : సెన్సెక్స్‌ 484 పాయింట్లు ఎగసి 83,952 వద్ద ముగింపు — నిఫ్టీ 25,700 దాటింది

Exit mobile version