భార‌త జ‌ట్టును ఓడించడం చాలా క‌ష్టం

సంజూ శాంస‌న్ క‌మ్ బ్యాక్ ఈజ్ సూప‌ర్

hellotelugu-RajivShukla

ఢిల్లీ : బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ ఎంపీ రాజీవ్ శుక్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త జ‌ట్టు ప్ర‌స్తుతం ప్ర‌పంచ క్రికెట్ లో అత్యంత బ‌లంగా ఉంద‌న్నాడు. ఇక ఏ జ‌ట్టు మ‌న‌ల్ని ఓడించ లేద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని టీం ఇండియా చ‌రిత్ర‌ను తిర‌గ రాసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఫైన‌ల్ లో న్యూజిలాండ్ జ‌ట్టును ఏకంగా 96 ర‌న్స్ తేడాతో ఓడించింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ప‌త‌నాన్ని బుమ్రా , శాంస‌న్ శాసించారు. శాంస‌న్ 89 ర‌న్స్ చేస్తే, స్పీడ్ స్ట‌ర్ బుమ్రా 4 ఓవ‌ర్లు వేసి కేవ‌లం 15 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 4 వికెట్లు తీయ‌డం మామూలు విష‌యం కాద‌న్నాడు రాజీవ్ శుక్లా.

టీం ఇండియా చాలా బలమైన జట్టుగా అవతరించిందని అన్నాడు. మీరు జట్టును ఎంత ప్రశంసించినా, అది ఇంకా తక్కువేన‌ని పేర్కొన్నాడు శుక్లా. వరుస విజయాలు జట్టు ఎంత బలంగా ఉందో చూపిస్తాయని పేర్కొన్నాడు. ఇక‌ మునుపటి మ్యాచ్‌లలో సంజు సామ్సన్ ప్రదర్శన ఉన్నప్పటికీ, జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచి అతనికి అవకాశం ఇచ్చిందని తెలిపాడు. రాబోయే రోజుల్లో శాంస‌న్ భార‌త దేశానికి మ‌రిన్ని విజ‌యాలలో కీల‌క భాగ‌స్వామ్యం ఉంటుంద‌ని తాను భావిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు బీసీసీఐ ఉపాధ్యక్షుడు.

Exit mobile version